Friday, May 10, 2024
- Advertisement -

ఆరోసారి ఆసీస్‌దే..ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

- Advertisement -

వన్డే ప్రపంచకప్‌ టైటిల్‌ని ఆరోసారి ఎగరేసుకుపోయింది ఆస్ట్రేలియా. గుజరాత్‌లో అహ్మదాబాద్ నరేంద్రమోడీ స్టేడియంలో భారత్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది ఆసీస్. దీంతో ఆరోసారి ప్రపంచకప్ గెలవగా రూ.33 కోట్ల ప్రైజ్ మనీని సొంతం చేసుకుంది. భారత్ విధించిన 241 పరుగుల లక్ష్యాన్ని 43 ఓవర్లలోనే చేధించింది.

ట్రావిస్‌ హెడ్‌ 120 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్‌లతో 137 పరుగులు చేయగా లబుషేన్‌ 58 నాటౌట్‌ రాణించడంతో ఆసీస్ విజయం ఖాయమైంది. తొలుత డేవిడ్‌ వార్నర్‌ (7), మిషెల్‌ మార్ష్‌ (15), స్టీవ్‌ స్మిత్‌ (4) వికెట్లు వెంటవెంటనే పడగా భారత శిబిరంలో ఆశలు చిగురించాయి. కానీ తర్వాత వికెట్ పడకుండా టార్గెట్‌ని చేధించడంలో సక్సెస్ అయ్యారు హెడ్, లబుషేన్. భారత బౌలర్లలో బుమ్రా 2, షమీ, సిరాజ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

ఇక అంతకముందు టాస్ గెలిచిన ఆసీస్…భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. కేఎల్‌ రాహుల్‌ 66, విరాట్‌ కోహ్లీ 54 పరుగులు చేయగా మిగితా బ్యాట్స్‌మెన్ అంతా ఘోరంగా విఫలమయ్యారు. దీంతో భారత్ భారీ స్కోరు సాధించలేకపోయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్‌ 3, హజిల్‌వుడ్‌, కమిన్స్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. హెడ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, కోహ్లీకి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులు దక్కాయి. భారత్‌కు ప్రైజ్ మనీ రూపంలో రూ . 16 కోట్లు దక్కాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -