Sunday, May 19, 2024
- Advertisement -

టీడీపీ – జనసేన..పొత్తులో లాస్ ఎవరికి?

- Advertisement -

ఏపీలో టీడీపీ – జనసేన కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పొత్తు ప్రకటించిన తర్వాత ఈ రెండు పార్టీల్లోని కార్యకర్తల్లో జోష్ నెలకొన్న లీడర్లలో మాత్రం టెన్షన్ దడ పుట్టిస్తోంది. పొత్తులో భాగంగా ఎవరికి సీటు దక్కుతుంది…?ఒక వేళ సీటు దక్కక పోతే ఏంటా అన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు.

ఇక పలు నియోజకవర్గాల్లో కీలక నేతలకు రాత్రులు అసలు నిద్ర పట్టడం లేదట. ఎందుకంటే సొంతపార్టీలోనే పోరు ఓ వైపు అయితే జనసేన నుండి ఒత్తిడి మరోవైపు వెరసీ ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట సదరు నేతలు. విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జ‌లీల్‌ఖాన్,ఎంపీ కేశినేని మధ్య పోరు నడుస్తోంది. తన కుమార్తెను రంగంలోకి దించేందుకు నాని తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా జనసేన నేత పోతుల మహేష్ సైతం బరిలో ఉంటానని తేల్చి చెబుతున్నారట.. అలాగే అనంత పురం అర్బ‌న్ టికెట్‌ను ప‌వ‌న్‌కు స‌న్నిహితుడు కోరుతుండగా ఇక్కడ టీడీపీ నుండి బలమైన నేత ప్రభాకర్ చౌదరి ఉన్నారు.

అలాగే రాజమండ్రి రూర‌ల్‌లో కందుల నగేష్ – బుచ్చయ్య మధ్య పోరు నడుస్తోంది. కాకినాడ ఎంపీ టికెట్‌ను నాగబాబు,తెనాలి నుండి నాదేండ్ల మనోహర్ ఖర్చీఫ్ వేసుకుని కూర్చోగా వీరికి టీడీపీ నేతల నుండి గట్టి పోటీ ఎదురవుతోంది. ఇక నగరి నియోజకవర్గంలో కిరణ్ రాయల్, గాలి ముద్దుకృష్ణమ కుమారుడు మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మొత్తంగా టీడీపీ – జనసేన మధ్య సీట పంపకం కొలిక్కి వచ్చి..ఈ రెండు పార్టీల నేతలను బుజ్జగించడం ఆ పార్టీలకు తలకు మించిన భారమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -