Friday, May 3, 2024
- Advertisement -

అఫిషియల్..సలార్ వాయిదా

- Advertisement -

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. ఈ సినిమా గురించి ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే తొలుత ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించారు. ఇక యుఎస్‌లో నెల రోజుల ముందునుండే ప్రీ బూకింగ్స్‌ కూడా స్టార్ట్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తర్వాత బుక్ చేసుకున్న వారికి డబ్బులు వెనక్కి ఇచ్చేశారు. దీంతో సలార్ పోస్ట్ పోన్ అవడం ఖాయమని అప్పుడే అంతా భావించారు. అయితే మేకర్స్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లో సెప్టెంబర్ 28న విడదుల చేస్తామని ప్రకటించారు.

కానీ తాజాగా సలార్ వాయిదాపై అఫిషియల్‌గా అనౌన్స్‌మెంట్ ఇచ్చింది చిత్ర నిర్మాణ సంస్థ. ఈ మేరకు ట్విట్టర్‌లో వాయిదాకు సంబంధించిన కారణలను వెల్లడించింది. సలార్ సినిమాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి దవ్యవాదాలు, కొన్ని అనివార్య కారణాల వల్ల సలార్ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కావట్లేదు. అర్ధం చేసుకుంటారని భావిస్తున్నాము. మీకు మరింత మంచి సినిమాటిక్ అనుభవం అందించడానికి మా చిత్రయూనిట్ కష్టపడుతుంది. సలార్ కొత్త రిలీజ్ డేట్ ని త్వరలోనే అనౌన్స్ చేస్తాము అని వెల్లడించారు.

ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ , జగపతి బాబు విలన్స్ గా, శ్రియారెడ్డి కీల‌క పాత్ర‌ను పోషించింది. ఈ సినిమా రెండు పార్టులుగా రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -