- Advertisement -

జగన్ ఢిల్లీ టూర్…టార్గెట్ ఆయనేనా?

- Advertisement -

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ గురించే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. లండన్ పర్యటన ముగించుకుని వచ్చిన జగన్…అధికారులతో ఉన్నత స్ధాయి సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, జైలు కెళ్లిన తర్వాత పరిణామాలు, శాంతిభద్రతల పరిస్థితులపై ఆరా తీశారు. ఇక జగన్ ఇవాళో రేపో ఢిల్లీ వెళ్లనున్నారనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతోంది.

ఈ నేపథ్యంలో జగన్‌ ఢిల్లీ పర్యటన అంతర్యమేంటీ?,అకస్మాత్తుగా సీఎం జగన్ హస్తిన పయనానికి గల కారణాలేంటీ..?కేంద్ర పెద్దలను ఎందుకు కలుస్తున్నారు..? ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఎక్కడ చూసిన ప్రధాన చర్చ.

ప్రధానంగా చంద్రబాబు అరెస్ట్ ను పలు జాతీయ పార్టీలు తప్పుబట్టాయి. ఇక దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు సీఎం జగన్. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ పై కేంద్ర పెద్దలు ఏమైనా ప్రశ్నిస్తారా? లేక సీఎం జగన్ ను సమర్థించేలా వ్యవహరిస్తారా? అన్నదానిపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఒకవేళ చంద్రబాబు అరెస్టు ప్రస్తావన వస్తే ఏపీలో తాజా పరిణామాలను ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా దృష్టికి జగన్‌ తీసుకెళ్తారని తెలుస్తోంది.

ఇక అలాగే దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదిస్తోంది బీజేపీ. అయితే ఏపీలో ఎన్నికలకు జూన్ వరకు గడువు ఉండటంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లేలా ఏమైనా చర్చ జరుగుతుందా? అన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే జగన్‌ టూర్‌పై రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే వైసీపీ నేతలు మాత్రం ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పోలవరం ప్రాజెక్టుకి నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడిగేందుకే సీఎం జగన్ ప్రధాని అపాయింట్ మెంట్ కోరారని చెబుతున్నారు. మొత్తానికి సీఎం జగన్ ఢిల్లీ టూర్ టీడీపీ నేతల్లో టెన్షన్ పుట్టిస్తుండగా ఏపీలో హాట్ టాపిక్ మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -