- Advertisement -
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన సోదరి అర్పితా ఖాన్ను హైదరాబాద్ కుర్రాడికి ఇచ్చి వివాహం జరిపించిన సంగతి తెలిసిందే.ఇప్పుడు సల్మాన్ మామ అయ్యాడు.సల్మాన్ ఖాన్ అల్లుడు పేరు అహిల్.అల్లుడు రెండోవ పుట్టిన రోజున మామ సల్మాన్ సందడి చేశాడు.అబుదాబిలో బాబు బర్త్డే పార్టీని ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ పార్టీకి హాజరై, సందడి చేశారు.
అర్పితా ఖాన్, జాక్వెలైన్ ఫెర్నాండెజ్ కలిసి ‘జుమ్మే కి రాత్’ పాటకు ఎంతో ఉత్సాహంగా స్టెప్పులేశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను సల్మాన్ అభిమానులు సోషల్మీడియా వేదికగా పంచుకున్నారు.సల్మాన్ ప్రస్తుతం ‘రేస్ 3’ సినిమాలో నటిస్తున్నారు. జాక్వెలైన్ ఫెర్నాండెజ్ కథానాయిక. రెమో డిసౌజా దర్శకుడు.
