ధోనీ స్థానాన్ని భర్తీ చేయలని లేదు : హార్దిక్ పాండ్య

- Advertisement -

టీమిండియా మాజీ కెఫ్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫినిషర్ స్థానాన్ని భర్తీ చేయాలనే ఆలోచన తనకి లేదని ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య అన్నారు. వెన్ను గాయం వల్ల మూడు నెలలుగా టీమిండియాకి దూరంగా ఉంటున్న హార్దిక్ పాండ్య ఇటీవల ఫిట్‌నెస్ సాధించాడు. దీంతో.. న్యూజిలాండ్‌తో ఈనెల 24 నుంచి ప్రారంభంకానున్న సిరీస్‌కి ఈ ఆల్‌రౌండర్ ఆడే ఛాన్సులు ఉన్నాయి.

ఈ ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌కప్ జరగనుంది. ఈ టోర్నీలో ధోనీ ఆడటంపై అనుమానాలు ఉన్నాయి. దాంతో ఫినిషర్ స్థానాన్ని హార్దిక్ పాండ్యాతో భర్తీ చేయాలని టీమిండియా మేనేజ్ మెంట్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంను హార్దిక్ పాండ్యాని అడగగా.. తనకు ధోనీ స్థానాన్ని భర్తీ చేసే సామర్ధ్యం లేదని అన్నారు.

- Advertisement -

“టీమిండియాలో ధోనీ స్థానాన్ని ఎప్పటికి భర్తీ చేయలేనని.. దాని గురించి ఆలోచన కూడా లేదని” అన్నాడు. ఇక హార్దిక్ పాండ్యా గాయపడిటం వల్ల భారత జట్టులో చోటు దక్కించుకున్న యువ ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఆశించిన మేర రాణించలేకపోతున్నాడు. దాంతో హార్దిక్ పాండ్యా రీఎంట్రీ ఖాయంగానే కనిపిస్తోంది.

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...