Thursday, May 2, 2024
- Advertisement -

హ‌మ్మ‌య్య ఆమెను హీరో ఆదుకున్నాడు

- Advertisement -

ఒక‌ప్పుడు సినిమాల్లో వెలిగి ఇప్పుడు అచేత‌నావ‌స్థ‌లో ఉన్న హీరోయిన్‌ను చూసి బాలీవుడే కాదు అన్ని భాషల సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారంతా బాధ‌ప‌డ్డారు. ప్రేక్ష‌కులు కూడా ఆమె ప‌రిస్థితిని చూసి జాలిప‌డ్డారు. ఆ స‌మ‌యంలో ప‌లువురు వారికి తోచినంత స‌హాయం చేశారు. ఆమెవ‌రో కాదు బాలీవుడ్ హీరో స‌ల్మాన్‌ఖాన్‌తో న‌టించిన హీరోయిన్ పూజ ద‌డ్వాల్. ప్ర‌స్తుతం క్ష‌యతో బాధ‌ప‌డుతూ ఆస్ప‌త్రిలో దిక్కుతోచ‌ని స్థితిలో ఉంది. క‌నీసం చాయ్ తాగ‌డానికి కూడా డ‌బ్బుల్లేని ప‌రిస్థితి ఆమెది. పూజా 15 రోజులుగా ముంబైలోని టీఆర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సల్మాన్‌ఖాన్‌ను స‌హాయం పూజ అడ‌గాల‌నుకున్నా ఆమె అడ‌గ‌లేక‌పోయింది.

ఎట్టకేలకు ఈ విషయం సల్మాన్‌ఖాన్‌కు తెలిసి పూజాను ఆదుకోవ‌డానికి ముందుకు వ‌చ్చారు. ఈ విషయం తెలుసుకున్న సల్మాన్ పూజ ద‌డ్వాల్ ప‌రిస్థితిపై బాధ‌ప‌డ్డారు. సాధ్యమైనంత ఎక్కువ సహాయం చేయ‌డానికే ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఆరోగ్యంతో పూజా దద్వాల్‌ బయటకు వస్తుందనే నమ్మకం ఉందన్నారు సల్మాన్.ఇటీవ‌ల పూజ‌కు త‌న రేసుగుర్రం సినిమా విల‌న్‌ ర‌వికిషన్‌ త‌న స్నేహితుడు ఉదయ్‌ భగత్ అనే వ్యక్తి ద్వారా వారం కింద‌ట చికిత్సకు కావాల్సిన డబ్బుతో పాటు పండ్లు కూడా పంపిణీ చేశారు.

పూజ 1990లో స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ‘వీర్‌ఘటి’ సినిమా చేసింది. గోవాలో క్యాసినో మేనేజ్‌మెంట్‌ కోర్సు చేస్తున్న పూజ‌కు కొన్నేళ్ల కింద‌ట‌ క్షయ వ్యాధి సోక‌డంతో భర్తతో పాటు ఇంట్లో వారు కూడా వదిలివెళ్లిపోయారు. దీంతో పూజ ప‌రిస్థితి దీనంగా మారింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -