శ్రీరామనవమి సందర్భంగా అభిమానుల కోసం ‘కల్యాణ వైభోగం’ సినిమా బృందం ఓ పాట విడుదల చేసింది. ఆనంద రాగాల శుభయోగం కల్యాణం వైభోగం అనే పాటను నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. నితిన్ హీరోగా దిల్ రాజు బ్యానర్‌లో నిర్మిస్తున్న సినిమా ‘శ్రీనివాస కల్యాణం’. ‘శతమానం భవతి’ దర్శకుడు సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ సినిమాలోని పాటను విడుదల చేశారు.
కల్యాణం వైభోగం..ఆనంద రాగాల శుభయోగం అనే ఈ పాట కుటుంబమొత్తాన్ని ఆకట్టుకునేలా ఉంది. ఈ వీడియోను నితిన్ కూడా తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేస్తూ ఈ వీడియోను షేర్ చేశాడు. ఈ సినిమాలోని ఈ పాట తనకు చాలా ఇష్టం అని మెసేజ్ పెట్టారు.
మార్చి 23వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. నితిన్‌తో రాశీఖన్నా, నందితా శ్వేత హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం నితిన్ నటించిన ఛల్ మోహన్ రంగా ఏప్రిల్ 5వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది.
