Friday, April 26, 2024
- Advertisement -

మ‌ళ్లీ ఒక‌టిగా క‌నిపించ‌నున్న షారుఖ్, స‌ల్మాన్ !

- Advertisement -

బాలీవుడ్ ను ఏలేస్తున్న హీరోల్లో షారుఖ్ ఖాన్, స‌ల్మాన్ ఖాన్ ముందు వ‌రుస‌లో ఉంటారు. వీరిద్దారు ఎంతో మంచి మిత్రులు కూడా.. కానీ వీరి ఫ్యాన్స్ మాత్రం ఒక్క‌టి కాదు. వీరిమ‌ధ్య ఎంతో బేధాభిప్రాయాలు ఉంటాయి. ప‌చ్చిగ‌డ్డి వేస్తే కూడా బ‌గ్గుమ‌నేసా ఉంటుంది. ఫ్యాన్స్ విష‌యాల్లో కొన్నిసార్లు షారుఖ్, సల్మాన్ మధ్య విభేదాలు వ‌చ్చి, కొంత కాలం దూరం దూరంగా ఉన్నట్లు కూడా తెలిసింది.

బాలీవుడ్ నంబర్ వన్ కిరీటం కోసం ఒకప్పుడు వీరి మధ్య ఎంతో పోటీ ఉండేది. ఆ సమయంలో ఈ హీరోలు ఇద్ద‌రూ క‌లిసి ఏ ఒక్క సినిమా చేయ‌లేదు. వాళ్ల కెరీర్ ప్రారంభంలో కరణ్ అర్జున్ తో పాటు మ‌రి కొన్ని సినిమాల్లో నటించారు. పోయిన‌ దశాబ్ద కాలంలో ఒకరి సినిమాల్లో ఒకరు అతిథి పాత్రలు కూడా చేశారు. ఇందులో సల్మానే ఎక్కువగా షారుఖ్ సినిమాలో క‌నిపించాడు.

ఈ పదేళ్లలో షారుఖ్ కు ఒక మంచి హిట్ కూడా రాలేదు. దాంతో రెండేళ్లకు పైగా షారుఖ్ విరామం తీసుకున్నాడు. ప్రస్తుతం పఠాన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సల్మాన్ అతిథి పాత్రలో మ‌ళ్లీ నటించబోతున్నట్లు అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు ఆ విషయం అధికారికంగా చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. అలాగే.. స‌ల్మాన్ కూడా దీన్ని ధృవీక‌రించాడు. ఈ సినిమా మంచి హిట్ కొడుతుంద‌ని చిత్ర యూనిట్ పేర్కొంటుంది.

రొమాన్స్ పండించ‌బోతున్న స‌త్య‌దేవ్, త‌మ‌న్నా

మోనాల్, అఖిల్ ఆన్‌స్క్రీన్ రొమాన్స్ మొద‌లైంది !

రాజ‌కీయాల్లోకి రంగ‌మ్మ‌త్త అన‌సూయ‌.. ఏ పార్టీయో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -