Thursday, April 25, 2024
- Advertisement -

మోనాల్, అఖిల్ ఆన్‌స్క్రీన్ రొమాన్స్ మొద‌లైంది !

- Advertisement -

తెగ పాపులారిటీ సంపాదించిన బుల్లితెర కార్య‌క్ర‌మం తెలుగు బిగ్ బాస్ సీజ‌న్ 4 ప్రేక్ష‌కుల‌ను తెగ ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ సీజ‌న్‌లో పాల్గోన్న అఖిల్ సార్థ‌క్‌, మోనాల్ గ‌జ్జ‌ర్‌ల గురించిన ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే బిగ్‌బాస్‌లో వీరి జంట‌కున్న క్రేజ్ అలాంటిది మ‌రి. ప్ర‌స్తుతం వీరిద్ద‌రు క‌లిసి ఆన్ స్క్రీన్‌పై రోమాన్స్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు.

ఈ బిగ్‌బాస్ జంట‌ను ఒక్క‌టి చేస్తూ… త్వ‌ర‌లోనే ఒక వెబ్ సిరీస్ మ‌న‌ముందుకు రాబోతుంది. ఈ వెబ్ సిరీస్‌లో మోనాల్‌, అఖిల్ సార్థ‌క్‌లు జంట‌గా న‌టిస్తున్నారు. ప్రేమికుల రోజు సంర్భంగా ఈ స్టార్స్ ఇద్ద‌రు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఈ సిరీస్‌కు ‘తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి’ అనే టైటిల్ పెట్టారు. దీనిని సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను పోస్ట‌ర్ ను విడుద‌ల చేశారు.

ఈ వెబ్ సిరీస్‌ను మాస్ట‌ర్ అజితేష్ వెంక‌ట్ స‌మ‌ర్ప‌ణ‌లో స‌రస్వ‌తి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. భాస్క‌ర్ బంటుప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ వెబ్ సిరీస్‌కు ఏ.భాస్క‌ర్ రావు నిర్మ‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఓ ప‌ల్లెటూరు నుంచి హైద‌రాబాద్ వ‌చ్చిన మిడిల్ క్లాస్ అబ్బాయి.. గుజ‌రాత్ నుంచి హైద‌రాబాద్ వ‌చ్చిన అమ్మాయి మ‌ధ్య క‌లిగే ల‌వ్ స్టోరీతో తీస్తున్నామ‌నీ, మార్చ్ నుంచి వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తామ‌ని తెలిపారు.

ఊర‌మాస్‌.. రామ్ కొత్త సినిమా మాములుగా ఉండ‌దు… లింగుస్వామితో.. !

నిధి అగ‌ర్వాల్ ఫ్యాన్స్ మాములుగా లేరు… ఏకంగా అదే చేశారుగా.. !

రాజ‌కీయాల్లోకి రంగ‌మ్మ‌త్త అన‌సూయ‌.. ఏ పార్టీయో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -