రొమాన్స్ పండించ‌బోతున్న స‌త్య‌దేవ్, త‌మ‌న్నా

- Advertisement -

హీరో స‌త్యదేవ్.. సినీ బ్యాగ్రౌండ్ ఏమీ లేకుండా ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న న‌టుడు. ఎంతో క‌ష్ట‌ప‌డి త‌ను చేస్తున్న సాఫ్ట్ వేర్ జాబ్ కు వ‌దిలేసి ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చాడు. చిన్న చిన్న పాత్రల‌తో మొద‌లైన ఆయ‌న సినీ కెరీర్.. ఇప్పుడు ఒక స్థాయికి వ‌చ్చిందని చెప్పాలి. గతేడాది విడుద‌లైన‌ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో క్రేజ్ సంపాదించుకున్నాడు.

ఇప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నాతో సినిమా చేస్తున్నాడు. నాగశేఖర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పేరు శీతాకాలం. ఈ సినిమా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వ‌చ్చే యూత్ లైఫ్‌లో జ‌రిగే సంఘ‌ట‌నల ఆధారంగా తెర‌కెక్కుతుంది. ఆహ్లాద‌క‌ర‌మైన సంఘ‌ట‌ణ‌ల‌ను ప్రేక్ష‌కుల‌కి గుర్తు చేసే ఉద్దేశంతో సినిమాను తీస్తున్న‌ట్లు డైరెక్ట‌ర్ చెబుతున్నాడు.

ఈ సినిమా టైటిల్ కు ఇప్ప‌టికే మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. హీరో స‌త్యదేవ్, త‌మ‌న్నానే కాకుండా మేఘా ఆకాష్, కావ్య‌శెట్టి వంటి మంచి యాక్ట‌ర్లు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. దాంతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలు పెరిగిపోతున్నాయి. క‌న్న‌డ‌లో సూప‌ర్ హిట్ అయిన ల‌వ్ మాక్ టేల్ ఆధారంగా దీన్ని తెర‌కెక్కిస్త‌న్న‌ట్లు డైరెక్ట‌ర్ చెబున్నాడు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది. అందులో ఎంతో రొమాంటిక్ గా హీరో హీరోయిన్లు ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది. సినిమాకూడా ఇదే రేంజ్ లో రొమాంటిగ్ గా ఉంటుంద‌ని ఈ సినిమా యూనిట్ చెబుతోంది.

రాజ‌కీయాల్లోకి రంగ‌మ్మ‌త్త అన‌సూయ‌.. ఏ పార్టీయో తెలుసా?

నిధి అగ‌ర్వాల్ ఫ్యాన్స్ మాములుగా లేరు… ఏకంగా అదే చేశారుగా.. !

మోనాల్, అఖిల్ ఆన్‌స్క్రీన్ రొమాన్స్ మొద‌లైంది !

రామ్ చ‌ర‌ణ్ ఉపాస‌న మ‌ధ్య గోడ‌వ‌లు ! అందుకేన‌ట !

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -