Friday, March 29, 2024
- Advertisement -

సల్మాన్ ఖాన్ ‘రాధే’ట్రైలర్ రిలీజ్.. సీటీమార్స్ స్పెషల్..

- Advertisement -

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రాధే. గతేడాది విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ రంజాన్‌ కానుకగా మే 13న రాధే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని ఏక కాలంలో థియేటర్లతో పాటు ఓటీటీలో కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ ఓల్డ్ గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నాడు.

అలాగే అండర్ కవరేజ్ పోలీస్ గా విలన్ల భరతం పట్టేలా కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో రణదీప్ హుడా, జాకీ ష్రాఫ్, మేఘా ఆకాష్ కీలక పాత్రల్లో నటించారు. ఈద్ కానుకగా మే 13 2021న డిజిటల్ ప్లాట్ ఫామ్, అలాగే థియేటర్స్ ఒకేసారి విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. కాగా 2017 లో వచ్చిన కొరియర్ చిత్రం ది అవుట్ క్లాస్ చిత్రానికి రీమేక్ గా చిత్రంగా తెరకెక్కుతోంది.

డ్రగ్స్ మాఫియాను అంతం చేసే పోలీస్ ఆఫీసర్ స్టోరీని ప్రభుదేవా పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దాడు. ఇదిలా ఉంటే ఈ మూవీలో అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాధం’ మూవీలో సీటీమార్ సాంగ్ రాధే చిత్రయూనిట్‌ కాపీ కొట్టిందని మండిపడుతున్నారు. సల్మాన్‌, దిశా కనిపించే ఓ పాటలో పూర్తిగా బన్నీ స్టైల్లో భాయ్‌జాన్‌ స్టెప్పులు వేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -