Saturday, May 18, 2024
- Advertisement -

అనుష్క తో లిప్ కిస్ అంటే ఒద్దు అన్న హీరో

- Advertisement -

బాలీవుడ్ అంటే లిప్ లాక్స్…లిప్ లాక్స్ అంటే బాలీవుడ్ అని అంతా అనుకుంటారు. ప్రతీ హీరో హీరోయిన్ తో ముద్దు సీన్లు చేయడానికి ఎగబడుతూ ఉంటారు. కానీ ఈ ముద్దు సీన్లకు ఖాన్లు పెద్దగా ఆశ చూపరు అంటారు కానీ అమీర్ ఖాన్ ఎప్పటి నుండో ముద్దు సీన్లకి ఫేమస్ అయ్యాడు, ఇక షారుఖ్ ఖాన్ కూడా జబ్ తక్ హై జాన్ లో కత్రినాకైఫ్ పెదాలు ఓ రేంజ్ లో జుర్రెసుకున్నాడు.

కాగా ఇక ముద్దు సీన్లకు దూరంగా ఉంది కేవలం సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మాత్రమే. కెరీర్ మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఒక్కసారి కూడా హీరోయిన్స్ పెదాలను ముద్దాడని సల్మాన్ లేటెస్ట్ గా అలాంటి చాన్స్ వస్తే నేను చేయనంటే చేయను అని తెగేసి చెప్పడంతో దర్శకుడు ఆ సీన్ ని మార్చాల్సి వచ్చిందట.

ఇదంతా సల్మాన్ లేటెస్ట్ గా చేస్తున్న సుల్తాన్ సినిమాలోనిదట. ఇందులో ఓ సన్నివేశంలో హీరోయిన్ అనుష్క శర్మతో ఓ ముద్దు సీన్ ఉండగా దర్శకుడు ఎంత చెప్పినా ఆ సీన్ చేయనంటే చేయనని చెప్పడంతో చేసేది లేక మూతి ముద్దు సీన్ ని బుగ్గపై  ముద్దు సీన్ తీశాడట. అసలు సల్మాన్ ఎందుకని ముద్దు పెట్టడనేది మిస్టరీగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -