Monday, April 29, 2024
- Advertisement -

ముద్రగడ ని అరస్ట్ చేసే దమ్ముందా ?

- Advertisement -

తునిలో ముద్రగడ కాపుల కోసం దీక్ష చేసినప్పటి సందర్భంలో జరిగిన అల్లర్లు, రైలు దహనం కేసులకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేసిన వ్యవహారం ఇప్పుడు పెను దుమారంగా మారబోతున్నది. సుదీర్ఘ కాలం తర్వాత..వాతావరణం అంతాచల్లబడిపోయింది అనుకుంటున్న తరుణంలో..ఈ అల్లర్లకు బాధ్యులుగా పేర్కొంటూ సీఐడీ పోలీసులు వీడియో ఫుటేజీల ద్వారా సేకరించిన ఆధారాలను బట్టి ఆరుగురు నిందితులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ విషయంలో మంగళవారంనాటికి ముద్రగడ స్వయంగా రంగంలోకి దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోతున్నది. దీక్ష సందర్భంగా జరిగి యావత్‌ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అన్నీనేనే అయినప్పుడు నన్ను అరెస్టు చేసిన తర్వాతే మిగిలిన వారి అరెస్టులు జరగాలంటూ ముద్రగడ పద్మనాభం పోలీసు స్టేషన్‌ ఎదుట ధర్నాకు దిగడం ఇప్పుడు సంచలనంగా మారుతున్నది. 

తుని అల్లర్లకు బాధ్యులుగా భావిస్తున్న వారిని సీఐడీ పోలీసులు అరెస్టుచేశారు. అయితే వారికిమద్దతుగా ముద్రగడ రంగంలోకి రావడం అనూహ్య పరిణామం. అడ్డగోలుగాకేసులు పెడితే ఊరుకునేది లేదు..నిర్దిష్టంగా ఆధారాలుంటే తప్పు చేసిన వారి మీదచర్యలు తీసుకోండి అని గతంలో చెప్పిన ముద్రగడ ఇప్పుడు ఇలా ఆందోళనకు దిగుతారని చంద్రబాబు ప్రభుత్వం ఊహించి ఉండకపోవచ్చు. మరో రకంగా చెప్పాలంటే ఈ అరెస్టుల ద్వారా సర్కారు మానిపోయిన గాయాన్ని మళ్లీ రేపుతున్నట్లున్నదని కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

మొత్తం బాధ్యుడిగా ముందు తనను అరెస్టు చేయాలంటూ ముద్రగడ రోడ్డు కెక్కడానికి కాపు వర్గం నాయకులనుంచి మద్దతు కూడా లభిస్తోంది. ముద్రగడ దీక్ష సంగతి తెలియగానే రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచిఆయనకు అనుకూలురైన కాపు వర్గపు నాయకులంతా తుని చేరుకుంటున్నారు. ముద్రగడకు మద్దతుగా వారు కూడా ఈ అరెస్టులను నిరసిస్తూ దీక్ష చేసే అవకాశంకనిపిస్తోంది. అల్లర్లకు సంబంధించి ముందు నాయకులను అరెస్టు చేయండి. తర్వాత కార్యకర్తలను అరెస్టు చేయండి అనేది ముద్రగడ డిమాండుగా కనిపిస్తోంది. ఈ పరిణామాలు మరింతతీవ్రంగా ముదిరే అవకాశం కూడా కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -