Friday, April 26, 2024
- Advertisement -

ఎన్నాళ్లకెన్నాళ్లకు..

- Advertisement -

ఆ ఇద్దరి జత చేయాలని చాలా మంది ఆశించారు. ఇందుకు ఆ ఇద్దరిని ఒప్పించాలని విశ్వప్రయత్నం చేశారు. అయినా వారి ప్రయత్నం ఫలించలేదు. చివరికి ఏం చేయలేక వదిలేశారు. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా. ఇంకెవరు కండల వీరుడు సల్మాన్ ఖాన్.. పొడుగుకాళ్ల సుందరి దీపికా పడుకొనే.

వీళ్లద్దరితో సినిమా తీయాలని నిర్మాతలు తెగ ఆశపడ్డారు. కాని సల్మాన్ కు టైమ్ దొరికితే దీపికకు దొరకక.. దీపికకు దొరికితే సల్మాన్ కు ఖాళీ లేక ఇన్నాళ్లు ఈ జంటతో సినిమా వర్క్ అవుట్ కాలేదు. ఇదిగో ఈ ఛాన్స్ ఇప్పుడు వచ్చింది.సల్మాన్ ఖాన్ హీరోగా ‘బజరంగీ భాయిజాన్’ ఫేమ్ కబీర్‌ఖాన్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది.

ఈ చిత్రంలో కథానాయికగా దీపిక పడుకోనేను అడిగారట. అంతకంటేనే నేను రెడీ అందట. పాత్ర కూడా మంచిది కావడంతో వెంటనే ఓకె చెప్పేసిందని బాలీవుడ్ టాక్. మరికొన్నాళ్లలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -