Monday, May 13, 2024
- Advertisement -

ప్రభుత్వ ఆధ్వర్యంలో పేదలకు సామూహిక వివాహాలు

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఇక మీదట రాష్ట్రంలో అన్ని మతాలకు చెందిన నిరుపేదలకు ప్రభుత్వమే సామూహిక వివాహాలు చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శుక్రవారం ఉదయం అనంతపురం జిల్లా వెంకటాపురంలో తెలుగుదేశం మాజీ నాయకుడు పరీంద్ర రవీంద్ర జ్ఞాపకార్ధం ఆయన భార్య ఆధ్వర్యంలో జరిగిన సామూహిక వివాహాలు ఎంతో వేడుకగా జరిగాయి.

ఈ  సందర్భంగా 250 జంటలు ఒక్కటయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన చంద్రబాబునాయుడు మాట్లాడుతూ పరిటాల కుటుంబం చేస్తున్న ఈ సామూహిక వివాహాల కార్యక్రమం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. అంతే కాదు ఎంతో స్ఫూర్తి కూడా ఇచ్చింది. ఇక మీదట ఎపిలో నిరుపేదలైన అన్ని మతాల వారికి సామూహిక వివాహాలు జరిపిస్తామన్నారు.

రవీంద్ర మొమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ సామూహిక వివాహాలు జరిగాయి. ఇక్కడ పెళ్లిళ్లు చేసుకున్న ఒక్కో జంటకు ప్రభుత్వం తరఫున పది వేల రూపాయల బహుమానాన్ని చంద్రబాబు ప్రకటించారు. దాదాపు రెండు గంటల పాటు ఇక్కడ ఉన్న సిఎం చంద్రబాబు అక్కడ నెలకొల్పిన పరిటాల రవీంద్ర విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -