Monday, April 29, 2024
- Advertisement -

సామజవరగమన రికార్డ్ కొట్టేసిందిగా.. శ్రీ విష్ణు కెరీర్ లో ఫస్ట్ టైం..!

- Advertisement -

ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో వచ్చిన సినిమా సామజవరగమన. శ్రీ విష్ణు, రెబా మౌనికా జాన్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాలో వీకే నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. జూన్ 29న రిలీజైన ఈ సినిమా ఫస్ట్ షో నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమా బడ్జెట్ కు తగినట్టుగానే బిజినెస్ జరగ్గా అది కూడా కేవలం 3 రోజుల్లోనే ప్రాఫిట్స్ తెచ్చింది. ఫైనల్ గా ఈ సినిమా సూపర్ ప్రాఫిట్స్ తో దూసుకెళ్తుంది.

సినిమా రిలీజై 3 వారాలు అవుతున్నా ఇంకా కొన్ని చోట్ల సామజవరగమన సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తెచ్చుకోగా యూఎస్ లో కూడా శ్రీ విష్ణు సినిమా రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. ఈమధ్య కాలం లో యూఎస్ లో తెలుగు సినిమాల హవా తగ్గింది. అంచనాలకు తగినట్టుగా సినిమాలు లేకపోవడం వల్ల అక్కడ బాక్సాఫీస్ దగ్గర్ బోల్తా కొడుతున్నాయి.

ఫైనల్ గా సామజవరగమన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యూఎస్ లో కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా యూఎస్ లో 1 మిలియన్ డాలర్స్ ని క్రాస్ చేసింది. శ్రీ విష్ణు ఖాతాలో మొదటి 1 మిలియన్ డాలర్ సినిమా ఇదే అని చెప్పొచ్చు. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఆడియన్స్ ని ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు మౌత్ టాక్ తో సినిమాని హిట్ చేశారు. శ్రీ విష్ణుకి కొంతకాలంగా సరైన హిట్లు లేకపోవడంతో సామజవరగమన హిట్ సూపర్ జోష్ ఇచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -