Thursday, May 9, 2024
- Advertisement -

ఇదే ప్ర‌శ్న‌ మీ కూతురు అడిగితే ఏం చెబుతావ్‌ : స‌మంత‌

- Advertisement -

సోష‌ల్ మీడియాలో కొంద‌రు ఎవ‌రిని ఏమైనా అడ‌గొచ్చు అనే ఆలోచ‌న‌తో ఉంటారు.తాజాగా అలాంటి సంఘ‌ట‌నే హీరోయిన్ స‌మంత‌కి ఎదురైంది.ప్ర‌స్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ మొత్తం లైంగిక వేధింపులు చూట్టునే తిరుగుతుంది.సింగ‌ర్ చిన్మయి త‌న జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి మీడియాతో పంచుకున్న సంగ‌తి తెలిసిందే.ఆమెకు మ‌ద్ద‌తుగా హీరోయిన్ స‌మంత ట్వీట్ చేసింది.దీంతో ఇద్ద‌రు నెటిజ‌న్లు స‌మంత‌ను రెండు డిఫరెంట్ ప్రశ్నలు అడిగారు.వారికి త‌గిన‌ట్లుగానే స‌మాధానాలు ఇచ్చింది స‌మంత‌.ఒక నెటిజన్ తను శ్రీ దత్త వివాదం గురించి ప్రస్తావిస్తూ.. పదేళ్ల కిందట జరిగిన వివాదం గురించి ఇప్పుడు చెబితే ఎలా ఒప్పుకుంటారు అని అడిగాడు. 

దీనికి స‌మంత ఇదే మా భయం.. ఎక్కడ మీరు నిజం ఒప్పుకోరు, అని సమయం కుదిరినప్పుడు నిజాల్ని చెబుతుంటాం అన్నారు.ఇక మ‌రో నెటిజ‌న్ స‌మంత‌ను ఓ ప్ర‌శ్న అడిగాడు.ఇవాళ మా కొడుకు మీటూ అంటే ఏమిటని అడిగాడు. అందుకు నేను.. ఆడవారి రిటర్మెంట్ ఇన్సూరెన్స్ పథకమని అన్నా. ఎందుకంటే అనవసరమైన విషయాల్లో తలదూర్చే ఆడవాళ్లు కెరీర్ ఎండ్ అయ్యాక ఈ భీమా వాడుకుంటారు. అప్పుడు మీడియా న్యూస్ అందిస్తుందని చెప్పగానే మా అబ్బాయి గాడ్ బ్లెస్‌ ఇండియా అన్నాడని సమంతకు వివరించాడు. దీనికి స‌మంత కూడా కాస్తా గట్టిగానే కౌంట‌ర్ ఇచ్చింది.ఇదే ప్ర‌శ్న మీ కూతురు అడిగితే ఏం స‌మాధారం చెప్పేవాడివి అని స‌మంత అత‌నిని ప్ర‌శ్నించ‌డంతో అటువైపు నుంచి మ‌ళ్లీ మాట లేకుండా పోయింది.సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే స‌మంత నెటిజ‌న్‌కు భ‌లే కౌంట‌ర్ ఎటాక్ ఇచ్చింద‌ని ఆమె అభిమానులు సంబ‌ర‌ప‌డిపోతున్నారు.

https://www.youtube.com/watch?v=iYOPOBHUHtQ

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -