టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం మహర్షి. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా , పీవీపీ, దిల్ రాజు, అశ్వినీదత్‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తుండగా, అల్లరి నరేశ్ ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. మహేశ్ బర్త్ డే రోజున విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది.
ఇక సినిమా నుంచి ఎప్పటికప్పుడు పోస్టర్లు రిలీజ్ చేస్తు సినిమాపై అంచనాలను పెంచేశారు. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేశారు చిత్ర యూనిట్. చోటీ చోటీ బాతే అనే సాగే పాటను విడుదల చేశారు. స్నేహం గురించి సాగే ఈ పాటను దేవి శ్రీ ప్రసాద్ అలపించారు. ఈ పాటకు మంచి స్పందన లభించింది. అయితే ఈ పాటు లిరికల్ వీడియోలో కొన్ని మూవీ పోస్టర్స్ కూడా ఉన్నాయి. వాటిలో మహేశ్ సైకిల్ పోస్టర్ కూడా ఉంది. గతంలో మహేశ్ బాబు శ్రీమంతుడు సినిమాలో సైకిల్ తొక్కుతాడు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
మహర్షిలో మళ్లీ సైకిల్ తొక్కడంతో ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని మహేశ్ అభిమానులు ఆశిస్తున్నారు. సినిమా విడుదలయ్యే వరకు అభిమానుల్లో ఎవరి అంచనాలతో వారు ఉంటారు.మరి ఏఈ సినిమా ఎలా ఉండబోతుంది అన్నది తెలుసుకోవాలి అంటే మే 9 వరకు ఆగాల్సిందే.
