Tuesday, May 21, 2024
- Advertisement -

నెటిజ‌న్ల‌కు వార్నింగ్‌ ఇచ్చిన రామ‌ల‌క్ష్మి

- Advertisement -

టాలీవుడ్‌ హీరో నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకొని అక్కినేని వారి కోడలైన సమంత నెటిజన్లపై మండిపడ్డారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ కాస్త తీరిక దొరికిందని సమయాన్ని వృధా చేయకుండా ఆస్వాదిస్తున్నాని సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.

అయితే సమంత తాను బికినీ వేసుకుని ఫొటో దిగి దాన్ని ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. స‌మంత ఫోస్ట్ చేసిన ఫోటోపై నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మ‌రొ కొంద‌రు స‌మంత ఇలా షాక్ ఇచ్చిందేంటంటూచ‌ర్చించుకుంటున్నారు.పెళ్లైన స్త్రీ ఇలా బికినీ వేసుకుని ఫొటోలు దిగడ‌మే కాకుండా దాన్ని పోస్టు చేయ‌డం ఏంటని అంటున్నారు.

మ‌రికొంద‌రైతే మ‌రిన్ని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. దీంతో స‌మంత మ‌రోసారి సోష‌ల్ మీడియాలో మ‌రో పోస్ట్ చేసి గ‌ట్టిగా స‌మాధానం ఇచ్చింది. తానిప్పుడు ఒక కోట్‌ను పోస్ట్‌ చేయాలని, ఎందుకంటే త‌న‌ గత పోస్ట్‌ అంత అసభ్యకరంగా ఏమీ లేదని ఆమె పేర్కొంది. త‌న‌ రూల్స్ తాను రాసుకుంటాన‌ని, అభిమానులు త‌న నియమాలు రాయడం కాదని, ఎవ‌రి రూల్స్ వాళ్లు రాసుకోండని కాస్త ఘాటుగా ట్వీట్ చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -