Monday, May 6, 2024
- Advertisement -

మాస్టర్ స్ట్రాటజీలు అమలు చేయడంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి

- Advertisement -

కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి వార్త‌ల్లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. పార్టీకి సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను కేంద్రం ద‌గ్గ‌ర చ‌క్క‌బెట్ట‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. సీఎం చంద్ర‌బాబుకే దొర‌క‌ని పీఎమ్ అపాయంట్‌మెంట్ విజయసాయిరెడ్డి ఏకంగా మూడుసార్లు పొందారు. అంతకుముందు బీహార్ గవర్నర్‌గా ఉన్న ఇప్పటి రాష్ట్రపతి రామ్‌నాధ్ కొవింద్‌ని ముందే కలిసి అభినందించారు.

అయితే గ‌త కొద్దిరోజులుగా ఆయ‌న దూకుడు పెంచారు. దీనికి ప్ర‌ధాన కారం2014లొ ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ తప్పకుండా తన పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి అవుతారనే అభిప్రాయం చాలామందిలొ ఉంది. ఐతే ఆ సీట్లు కాస్తా 60పై చిలుకు దగ్గరే ఆగిపొవడంతొ అది నెరవేరలేదు. అప్ప‌ట్లో సీట్ల‌కేటాయింపుల్లో సరైన వ్యూహం , వ్యూహకర్త లేకపొవడం వల్లనే అలా జరిగిందనే విమ‌ర్శ‌లు వ‌చ్చిన‌సంగ‌తి తెలిసిందే.

అందుకే ఈసారి అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌కుండా మాస్టర్ స్ట్రాటజీలు అమలు చేయడానికే జగన్ విజయసాయిని రంగంలొకి దింపారంటారు..ఆల్మొస్ట్ ఆయన వ్యూహం ఫలించింద‌నే చెప్పాలి. అందుకే ఇప్పుడు కేంద్రంలొని జాతీయపార్టీలు జగన్‌ని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయ్. ఈ సందర్భంలొనే విజయసాయిరెడ్డి.. జగన్ ని సిఎం పదవిలొ చూసేంతవరకూ ఇలా గడ్డం తీయననే శపథం చేసారని కొంతమంది అంటారు.

అసలు టార్గెట్ 2019 ఎన్నికలు అని అది మాత్రం మిస్సవదని పార్టీలొని సన్నిహితుల వద్ద విజయసాయిరెడ్డి వ్యాఖ్యానిస్తున్నారట. తన పట్టుదలకి నిదర్శనంగానే ఈ కొత్త గెటప్‌తొ ముందుకు సాగుతున్నట్లు చెప్తున్నారు..ఐతే కొంతమంది మాత్రం రాజ్యసభ ఎంపిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గెటప్ ఉంటేనే దేశవ్యాప్తంగా గుర్తింపు ఉఁటుందని అందుకు తగ్గట్లే లుక్ మార్చినట్లు చెప్తున్నారు. అయితే అందులో ఎంత‌వ‌ర‌కు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -