Friday, May 17, 2024
- Advertisement -

దేవుడా…… దుబాయ్‌లో మొదలెట్టారా…… దిమ్మతిరిగే సెటైర్స్ పడుతున్నా అదే డ్రామానా

- Advertisement -

చంద్రబాబు దుబాయ్‌లో అడుగుపెట్టాడు. చివరి బడ్జెట్‌లో కూడా కేంద్రం చిప్ప చూపించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా రగిలిపోతుంటే బాబు మాత్రం ఎంచక్కా విదేశీ టూర్ ప్లాన్ చేసుకున్నాడు. షరా మామూలుగానే చంద్రబాబు దుబాయ్‌లో అడుగు పెట్టీ పెట్టగానే పచ్చ బ్యాచ్ మొత్తం అలర్ట్ అయింది. అక్కడ బాబు ఎవరితో ఒకరితో మీట్ అవుతూ ఉండడం…..వేల కోట్ల పెట్టుబడులు……..లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ ఇక్క రసరమ్యమైన కథలు సీమాంద్ర ప్రజలకు వినిపించడం అనే డ్రామా మళ్ళీ మొదలెట్టారు. నాలుగేళ్ళుగా ఇదే డ్రామా…….కానీ అధికారికంగా చెప్పమంటే మాత్రం ఎందుకు చెప్పాలి అని దబాయిస్తారు? విదేశీ టూర్లు, పారిశ్రామిక సమ్మిట్‌ల సమయంలో ప్రపంచంలోనే లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని చెప్పే చంద్రబాబు…….మరో సందర్భంలో ఎపిని దిక్కులేకుండా చేస్తారా? అనాథ అయిపోయింది, రోజువారీ చెల్లింపులకు కూడా డబ్బులు లేని పరిస్థితి అంటూ బీద అరుపులు కూడా అరుస్తాడు. ఆ విషయం పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్‌కి మోడీ చిప్ప ఎందుకు చూపిస్తున్నాడో తెలుసా? చంద్ర బాబు పెట్టుబడుల కథలు ఎన్నో విన్నారా? పచ్చ బ్యాచ్ పెట్టుబడుల కహానీపై సోషల్ మీడియాలో పేలుతున్న సూపర్బ్ సెటైర్ మీకోసం…….చదివి ఎంజాయ్ చేయండి.

పచ్చ బ్యాచ్ పెట్టుబడుల కహానీపై సూపర్ సెటైర్………..:

కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టే ముందు రోజు అమిత్ షా, అరుణ్ జైట్లీ, ఆర్ధిక శాఖ ముఖ్యకారదర్శి, ఇతర ప్రముఖులు ప్రధాన మంత్రి మోదీతో సమావేశమయ్యారు. బడ్జెట్ గురుంచి చర్చ జరిగాక, బడ్జెట్ ప్రతులు పరిశీలించిన మోదీ ” ఈసారి బడ్జెట్ బాగుంది. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయానికి పెద్ద పీట వేస్తున్నాం. ఇక సవరణలు ఏం లేవు. ఇదే ఫైనల్ చేయండి జైట్లీ గారు” అని అమిత్ షా వైపు చూసి “మీకు కూడా సమ్మతమే కదా షా జి? ” అని అడిగారు.

హా, మనం అనుకున్న బడ్జెట్ ఇదే కదా? కానీ… అని అమిత్ షా నసుగుతుంటే, చెప్పండి ఏదైనా సమస్య ఉంటే అడిగారు మోదీ. పక్కనే ఉన్న ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి కల్పించుకుని, “సార్, అంతా బాగుంది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనం ఏం కేటాయించలేదు. పోలవరం, రాజధాని, ప్రత్యేక హోదా,రైల్వేజోన్…… ఇలా దేని మీదా బడ్జెట్ కేటాయింపులు లేవు. దీనిమీద వ్యతిరేకత వస్తుందేమో అని “….. అని జైట్లీ వైపు చూడగా

నాదేముంది అంతా మీ దయ అన్నట్టు మోదీ వైపు చూసాడు జైట్లీ. మోదీ చిద్విలాసంగా నవ్వి” మనం ఆంధ్రాకి బడ్జెట్ కేటాయించడం ఏంది? మనమే ఆంధ్రాని అప్పు అడగాలనుకుంటున్నాం ” అని తన పీఏ వైపు చూసి “అవి తీసుకురా” అన్నాడు. పీఏ లోపలికెళ్లగా , మిగతా అందరూ క్వశ్చన్ మార్క్ మొహాలతో చూస్తున్నారు. కొన్ని క్షణాల్లో పీఏ ఒక పెద్ద పేపర్ల కట్ట తెచ్చి టీపాయ్ మీద పెట్టాడు. అందరూ వాటి వైపు చూడగా అవి ” ఈనాడు, ఆంధ్ర జ్యోతి” పేపర్లు.

“తీసి చదువు” అన్నారు మోదీ. పీఏ ఒక్కో పేపర్ తీసి చదవసాగాడు…..
వైజాగ్ సదస్సులో పది లక్షల కోట్ల పెట్టుబడులు .
త్వరలో ఐదు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టనున్న చైనా.
సోమాలియా దేశం నుండి పెట్టుబడుల వరద, సుమారు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడుల అంచనా.
దవోస్ నుండి ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు తేనున్న చంద్రబాబు.
అమెరికాలో లోకేష్ పెట్టుబడుల వేట, ఐదు లక్షల కోట్లు తరలి రానున్నట్టు వినికిడి.
అంగారక గ్రహం నుండి ….. అని పీఏ చెప్పబోతూంటే “ఆపమన్నట్టు” చెయ్యి ఎత్తాడు మోదీ.
మిగతా వారంతా డిస్కవరీ ఛానెల్లో కప్పల్లాగా నోరు తెరచి అలానే ఉన్నారు.
ఇప్పటివరకు ఎన్ని లక్షల కోట్లు అయ్యాయి? అడిగాడు మోదీ.
కాస్త ఆలోచించి “యాభై లక్షల కోట్లు సార్ ” చెప్పాడు జైట్లీ.
మన బడ్జెట్ ఎంత?
ఇరవై ఐదు లక్షల కోట్లు అంటే ఆంధ్రా పెట్టుబడుల్లో సగం మన బడ్జెట్ అన్నమాట. ఇక మనం ఏం ఇవ్వగలం వాళ్లకి? ఆ పెట్టుబడుల్లో వాళ్ళు అంతర్జాతీయ రాజధాని కట్టుకోవచ్చు, పోలవరం పూర్తి చేయొచ్చు, ఇక ప్రత్యేక హోదా అంటారా…. అది ఏ వనరులు లేని బీద రాష్ట్రానికి. లక్షల కోట్ల పెట్టుబడులు, కోటి ఉద్యోగాలు, అరవై ఐటి కంపెనీలు,అద్బుతమైన రాజధాని….. ఇన్ని ఉన్న రాష్ట్రానికి మనమేం చేయగలం? ఏం ఇవ్వగలం? చెప్పండి అన్నాడు మోదీ.

ఏం చేయలేము సార్” ముక్తకంఠంతో అన్నారు అందరూ.
సో, ఇదే ఫైనల్ చేయండి” అని పైకి లేచాడు మోదీ.

“అన్నట్టు షా జి, నాయుడు గారికి ఫోన్ చేసి పది లక్షల కోట్లు పంపమని చెప్పండి, అసలే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి ”
సెటైర్ అదిరిపోయింది కదా……కామెడీ విషయం పక్కనపెడితే లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నాను అని చెప్పే చంద్రబాబు 2014 నుంచీ ఇప్పటి వరకూ లక్ష కోట్ల అప్పులు ఎందుకు చేసినట్టు? మద్రాసు నుంచి విడివడి ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ 2014 వరకూ అందరు ముఖ్యమంత్రులూ కలిసి సీమాంధ్రప్రజల నెత్తిన అప్పుల కంటే 2014 తర్వాత నుంచీ ఇప్పటి వరకూ చంద్రబాబు తెచ్చిన అప్పులే ఎక్కువ ఎందుకు ఉన్నాయి? ఈ అప్పులు లెక్కలు అధికారికమే. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానాన్ని నిజాయితీగా ఆలోచించగలిగితే చాలు……..పచ్చ పెట్టుబడుల డ్రామా మొత్తం తెలిసిపోతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -