Friday, March 29, 2024
- Advertisement -

బాక్స్ ఆఫీస్ దుమ్ము దులుపుతున్న సమంత

- Advertisement -

సమంత ప్రధాన పాత్ర లో ఓ బేబీ అనే సినిమా నేడు విడుదల అయింది. ఈ మధ్య కాలం లో వచ్చిన చాలా సినిమాల కన్నా ఎక్కువ ఈ సినిమా నే మీడియా లో నిలిచింది. అలా నిలిచేలా సినిమా యూనిట్ బాగా కష్టపడి సినిమా ని ప్రమోట్ చేశారు. సమంత కి తన కెరీర్ లో ఈ సినిమా చాలా స్పెషల్ అని అందరూ భావించి పెద్ద ఎత్తున సినిమా విజయం కావాలని కాంక్షించారు. దేవి థియేటర్ దగ్గర సమంత కి ఏకంగా కటౌట్ కూడా పెట్టేసారు అభిమానులు.

అయితే నిన్న రాత్రి ప్రీమియర్స్ తో నే ఈ సినిమా కి పాజిటివ్ టాక్ వచ్చింది. కొరియా లో విడుదల అయ్యి పెద్ద విజయం సాధించిన మిస్ గ్రానీ అనే సినిమా కి రీమేక్ గా వచ్చింది ఈ చిత్రం ఓ బేబీ. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, లక్ష్మి, తేజ సజ్జా వంటి వారు ఈ సినిమా లో ముఖ్య పాత్రలు పోషించారు.

సినిమా మొదటి ఆట నుండే ఈ సినిమా కి మంచి పాజిటివ్ టాక్ రావడం తో సినిమా కి తిరుగులేదని బాక్స్ ఆఫిస్ వర్గాలు చెప్తున్నాయి. ఇదే జోరు కొనసాగితే సమంత కి తిరుగు ఉండదు అని చెప్పుకోవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -