- Advertisement -

శ‌న‌గ‌పంట రైతుల‌కు తీపిక‌బురు అందించిన వైఎస్ జ‌గ‌న్‌…

- Advertisement -

శ‌న‌గ పంట రైతుల‌కు వైఎస్ జ‌గ‌న్ తీపి క‌బురు అందించారు. గిట్టుబాటు ధ‌ర లేక అల్లాడుతున్న శ‌న‌గ రైతుల‌ను ఆదుకొనేందుకు జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. పాద‌యాత్ర‌లో భాగంగా వారికి ఇచ్చిన హామీని నిల‌బెట్టుకున్నారు. గొడౌన్లు, కోల్డ్ స్టోరేజ్‌‌లలో మగ్గుతున్న శనగలను మార్కెట్ రేటుకు అదనంగా క్వింటాలుకు రూ.1500 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతుల్ని ఆదుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

వ్యవసాయ మార్కెట్ కమిటీల నుంచి శనగ రైతుల జాబితా మేరకు చెల్లించాలని ఆదేశించారు. ప్రతి ఎకరాకు ఆరు క్వింటాళ్లు లేదా 30 క్వింటాళ్లకు మించకుండా శనగ రైతులకు చెల్లింపులు జరపాలని సూచించింది. ప్రభుత్వ నిర్ణయంపై శనగ రైతులు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం క్వింటాల్ శనగలు మార్కెట్‌ ధర రూ.5 వేలు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -