Saturday, May 11, 2024
- Advertisement -

అది ఏడుపు కాదు

- Advertisement -

అఖిల్ హీరోగా న‌టించిన హలో సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైద‌రాబాద్‌లో బుధ‌వారం సాయంత్రం జ‌రిగింది. ఈ వేడుక‌కు మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్‌తోపాటు నాగ‌చైత‌న్య‌, స‌మంత ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. ఆ స‌మ‌యంలో నాగ్ మాట్లాడుతు నాగ‌చైత‌న్య గురించి ఆశ‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని చెప్పారు. `చైత‌న్య అంత మంచి మ‌న‌సు నాకు లేదు  ఎవ‌రికీ లేదు` అని అన్నారు నాగ్‌.ఆ స‌మ‌యంలో చైత‌న్య ప‌క్క‌నే ఉన్నా స‌మంత క‌ళ్ల నుండి క‌న్నీళ్లు వ‌చ్చాయంటా!ఈ విష‌యాన్ని ఓ అభిమాని గ‌మ‌నించి స‌మంత‌కు ట్వీట్ చేశాడు.

నాగ్ మాట్లాడుతుండ‌గా స‌మంత క‌న్నీళ్లు తుడుచుకుంటున్న వీడియోను పోస్ట్ చేసి.. `నిజ‌మైన ప్రేమ అంటే ఇదే` అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు స‌మంత స్పందించింది. `అయ్యో అది ఏడుపు కాదు. కంటికి ఇన్ఫెక్ష‌న్ సోకిందంతే` అని సమాధానం ఇచ్చింది. కంటి ఇన్ఫెక్ష‌న్ కార‌ణంగానే స‌మంత షూటింగ్‌ల‌కు కాస్త విరామం ఇచ్చింది.స‌మంత ప్ర‌స్తుతం రాంచ‌ర‌ణ్ ప‌క్క‌న రంగ‌స్థ‌లం మూవీలో హీరోయిన్‌గా చేస్తుంది.త‌మిళ్‌లో మ‌రో రెండు సినిమాలు చేస్తుంది ఈ భామ‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -