Tuesday, May 14, 2024
- Advertisement -

అనుకున్న‌దే జ‌రిగింది… సైన్స్‌ కాంగ్రెస్‌ తొలిసారి వాయిదా

- Advertisement -

వందేళ్ల చ‌రిత్ర‌లో ఎప్పుడూ జ‌ర‌గ‌ని ప‌రిస్థితి ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం వ‌ల‌న జ‌రిగింది. జాతీయ కార్య‌క్ర‌మం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించే ఉత్స‌వాలు ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం ప‌రిస్థితుల నేప‌థ్యంలో వాయిదా ప‌డేలా జ‌రిగింది. ఇలా ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు. వాస్త‌వంగా హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యంలో ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్ 2018 జ‌న‌వ‌రి 3-7వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించాలి.

దాదాపు 100 ఏళ్లుగా జ‌రుగుతున్న సైన్స్‌ కాంగ్రెస్‌కు మొట్ట‌మొదటిసారిగా ఆటంకం ఏర్పడింది. ప్ర‌స్తుతం ఓయూలో నెల‌కొన్న‌ ప్రస్తుత పరిస్థితుల ప్రభావంతో సైన్స్ కాంగ్రెస్ నిర్వహించడం కుద‌ర‌దు అని నిర్వాహకులు తేల్చి చెప్పారు. దీనికి రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా వంత పాడుతూ ఓయూలో కాకుండా హైద‌రాబాద్‌లోని హైటెక్స్‌లో సైన్స్ కాంగ్రెస్ నిర్వ‌హిద్దామ‌ని లేఖ కూడా కేంద్రానికి లేఖ రాసింది. వీట‌న్నిటి నేప‌థ్యంలో చివ‌ర‌కు కాంగ్రెస్‌నే వాయిదా ప‌డేలా చేశారు. ప్ర‌స్తుతం సైన్స్ కాంగ్రెస్ తాత్కాలికంగా వాయిదా పడింది.

ఇంటెలిజెన్స్‌ సలహా మేరకే నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓయూలో 2018, జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు 105వ జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌ జరగాలి. మళ్లీ ఎప్పుడు, ఎక్కడ నిర్వహించేది 27వ తేదీ జరిగే సమావేశంలో నిర్ణయించనున్నట్లు స‌మాచారం.
ఈ సైన్స్ కాంగ్రెస్ 11 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో నిర్వ‌హించ‌డానికి ప్ర‌ణాళిక ర‌చించారు. వందేళ్లలో సైన్స్ కాంగ్రెస్ వాయిదా పడడం ఇదే తొలిసారి. గతేడాది ఈ సదస్సు ఆంధ్ర‌ప్ర‌దేశ్ తిరుపతిలోని శ్రీ వెంక‌టేశ్వ‌ర విశ్వ‌విద్యాల‌యంలో నిర్వహించారు. గతంలో ఐదుసార్లు జాతీయ సైన్స్ కాంగ్రెస్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. మొదటిసారిగా 1937‌లో 24 వ ఇండియన్ కాంగ్రెస్‌ హైదరాబాద్‌లో జ‌రిగింది.

1954, 1964, 1979, 2006లో ఈ స‌ద‌స్సు హైద‌రాబాద్‌లో జ‌రిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత తొలిసారి నిర్వ‌హించ‌నున్న ఈ స‌ద‌స్సు వాయిదా ప‌డ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిచ్చే అవ‌కాశం ఉంది. ఈ విష‌యం ముందే ఆద్య మీడియా చెప్పింది. ఓయూను చూసి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు భ‌య‌ప‌డుతున్నాయ‌ని పేర్కొంది. స‌భ‌ను వేరో చోట నిర్వ‌హించేందుకు ప్ర‌ణాళికలు వేస్తోంద‌ని కూడా తెలిపింది. కానీ ఇలా వాయిదా పడుతుంద‌ని అనుకోలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -