Wednesday, May 8, 2024
- Advertisement -

పవన్ ఎన్నికలలో పోటీ చేస్తారా….? చేస్తే అనర్హత వేటు పడుతుందా..?

- Advertisement -

ఓ తెలుగు న్యాయమూర్తి ఇవాళ్ళ సుప్రీంకోర్టులో ఓ సంచలన తీర్పు ఇచ్చారు.. ఈ తీర్పు తో 2019 ఎన్నికలలో జనసేన పార్టీ పోటీలో ఉంటుందో లేదో కానీ… జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కి ఓ షాక్ తగలబోతోందా… అసలు ఈ తీర్పు లో ఏముంది.. ఇకపై ఎన్నికలలో పోటీ చేయబోయే ప్రతి అభ్యర్ధీ నామినేషన్లు దాఖలు చేసే ముందు వాటిలో తన ఆస్తులు.. అప్పులు పొందుపరచాలి. వాటితో పాటే తన భార్య, పిల్లల వివరాలు కూడా జత చేయాలి. ఇప్పటిదాకా ఉన్న చట్టం ప్రకారం నామినేషన్లలో ఆస్తులు.. అప్పులు తమపై ఏవైనా కేసులు ఉంటే వాటి సంబందించిన వివరణ ఇవ్వాలి కాని ఇప్పుడు సంతానం గురించిన వివరాలు కూడా జతపరచాలి. ఈ నిబంధనకి పవన్ కల్యాణ్ పోటీకి సంబంధం ఏమిటి అనుకుంటున్నార… అక్కడే ఉంది అసలు మెళికి..

పవన్ కల్యాణ్ మొదటి భార్య నందిని కి విడాకులు ఇచ్చాక… రేణూ దేశాయ్‌తో కలిసి కాపురం చేస్తున్నాడన్న విమర్శలు రావడంతో రేణుదేశాయ్‌కి తాళి కట్టి ఇద్దరు పిల్లలకుతండ్రయ్యాడు… ఐతే ఆ పెళ్లి పెటాకులు చేసుకుని అన్నా లెజ్నోవాతో మరో ఇద్దరు పిల్లలకుతండ్రయ్యాడు. అంటే ఇప్పుడు పవన్ కల్యాణ్‌కు నలుగురు సంతానం.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. ఇప్పుడీ వివరాలన్నీ కూడా ఎన్నికల నామినేషన్ అఫడవిట్‌లో పొందుపరచాలి. సుప్రీంకోర్టు ఇలా అడగడానికి కారణం ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉంటే వారిని చట్టసభలకు ప్రాతినిధ్యం వహించేందుకు అనర్హులుగా ప్రకటించడానికే అంటారు. ఇలా సంతానంపై ఆంక్షలనేవి ప్రస్తుతానికి ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్ధులకు లేవు. స్థానిక సంస్థల పదవులకు మాత్రం వర్తిస్తుంది. చాలామంది ఈ విషయాన్ని పట్టించుకోకుండా పోటీ చేయడం ఆ తర్వాత పదవులు కోల్పోవడం కూడా జరిగాయ్. కొంతమంది తమ సంతానాన్ని దాచి పెట్టినా ఆ తర్వాతి కాలంలో ప్రత్యర్ధులు ఫిర్యాదు చేయడంతో వారిపై అనర్హత వేటు పడింది కూడా. అందుకే తమ సంతానం సంఖ్యని దృష్టిలో పెట్టుకుని కొంతమంది పక్కా ప్లాన్‌తో వ్యవహరిస్తున్నారని విమర్శలు కూడా ఉన్నాయ్. అలా పవన్ కల్యాణ్ కూడా ఇప్పుడు ఈ అనర్హత వేటుకి బలయ్యే అవకాశంపై చర్చలు సాగుతున్నాయ్. సో..ఇలాంటి కొన్ని నిబంధనలు తమ నేత పోటీకి అనర్హుడిని చేస్తాయేమో అనే భయాలు ఇప్పుడు పవన్ ఫ్యాన్స్‌లో కలగడం సహజం.

అయితే ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ చ‌ట్ట ప్ర‌కారం విడాకులు తీసుకొని మ‌రో పెళ్లి చేసుకోవ‌డంతో  ఈ తీర్పు ప‌వ‌న్ విష‌యంలో వ‌ర్తిస్తుందో లేదో చూడాలి. ఏది ఏమైనా ఎన్నిక‌ల స‌మ‌యం వ‌ర‌కు వేచి ఉండాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -