Tuesday, May 14, 2024
- Advertisement -

‘శ్రీమంతుడు” పోస్టర్ పై సమంత కామెంట్స్..!

- Advertisement -

ఇది వరకూ మహేశ్ బాబు ‘వన్’ సినిమా గురించి హాట్ కామెంట్స్ చేసింది సమంత. ఆ సినిమా ఫస్ట్ లుక్ గా విడుదల అయిన ఒక పోస్టర్ పై సమంత విరుచుకుపడింది. బీచ్ లో మహేశ్ బాబు నడుస్తుంటే..

అతడి వెనుక హీరోయిన్ పాకుతూ వస్తున్నట్టుగా ఉన్న పోస్టర్ పై సమంత విరుచుకుపడింది. అది ఆడవాళ్లను కించపరుస్తున్నట్టుగా ఉందని.. పొగరుబోతుదనానికి నిదర్శనంగా ఉందని సమంత కామెంట్ చేసింది. ఆమె అప్పటి సంగతి అలా ఉంటే.. ఇప్పుడు సమంత మళ్లీ కామెంట్స్ విసిరింది. మహేశ్ బాబు సినిమా ఫస్ట్ లుక్ పై ట్విటర్ లో కామెంట్స్ పెట్టింది.

ఈ సారి మాత్రం సమంత పాజిటివ్ కామెంట్స్ పెట్టింది. సినిమా పోస్టర్ ను పొగుడుతూ ట్వీట్ చేసింది. మహేశ్ బాబు సైకిల్ పై కనిపిస్తూ పెట్టిన పోస్టర్ పై స్పందిస్తూ.. అందులో ప్రిన్స్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడని సమంత వ్యాఖ్యానించింది. శ్రీమంతుడు సినిమా సూపర్ హిట్ కావాలని తాను కోరుకొంటున్నట్టుగా సమంత ట్వీట్ చేసింది. ఈ విధంగా మహేశ్ బాబు సినిమా గురించి సమంత పాజిటివ్ కామెంట్స్ పెట్టింది.

మరి గతంలో వన్ సినిమాపై స్పందిచిన తీరుతో సమంత మహేశ్ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని ఎదుర్కొంది. ఇప్పుడు మాత్రం ఫుల్ పాజిటివ్ గా స్పందించి.. వారి అభిమానాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నించినట్టుగా ఉంది! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -