Monday, May 20, 2024
- Advertisement -

143 ప్రత్యేకత…

- Advertisement -

(I Love You-143) ‘ఐ లవ్ యూ అంటే… ఛీ కొట్టిపోతావ్ అన్నా, ఐ లవ్ యూ అంటే… రారమ్మంటున్నా ఇవి ఈ మధ్య యూత్‌లో వినిపిస్తున్న ప్రేమరాగాలు. అయితే ఐ లవ్ యూ అనేది హలో చెప్పినంత ఈజీగా అయిపోయింది.

కుర్రకారు గుండెల్లో రైలులా పరిగెట్టే ఐ లవ్ యూ  సైన్స్ పరంగా ఆక్షరణ, అయస్కాంతత్వం అనే విధంగా చెప్పుకోవచ్చు. అయితే 143 ఎందుకింత ఫేమస్ అయ్యిందో మనకు తెలియదు కానీ, మన ఊహనలో 143 కి చాలా ప్రత్యేకత ఉంది. అది ఎలానో ఇప్పుడు చూద్దాం!

 1.

 నువ్వు-నేను 1టైన వేళ 4 దిక్కుల సమక్షంలో నీ మెడలో 3 ముళ్లు వేస్తా : 143

 2.

 143 నంబర్‌ను ఒక ట్లు, పదులు, వందల స్థానంలో ఒకటి తక్కువ చేసి చూద్దాం

 032 కదా    

 అలాగే ఒకటి ఎక్కువ చేసి చూద్దాం

 254 కదా

 పై రెండింటి సరాసరి : (032+254)/2 = 143

 

 3.

 143 అనది ఒక పాలిన్‌రోమ్ నంబర్

              143

            143

          143

        143

      ———-

       158873

      ———-

 పాలిన్‌రోమ్ అంటే మూండంకెల సంఖ్యను తీసుకొని పై క్రమంలో మాదిరిగా వేసి కూడితే వచ్చిన మొత్తంలో మొదటి రెండు నంబర్‌లను ఒక సంఖ్యగా భావించి, తర్వాత చివరి రెండు నంబర్‌లను మరో సంఖ్యగా భావించి వాటిని కూడినట్లైతే మధ్యలో ఉన్న రెండంకెల నంబర్ వస్తుంది.

 అంటే… 15+73 = 88, అందువలన 143 ఒక పాలిన్‌రోమ్.

 

 4.

 1+4+3 = 8 కదా

 ఇందులో ఉన్న గమ్మత్తేంటో ఇప్పుడు చూద్దాం…

 గణితంలో తొమ్మిది అంకెలుంటాయి.

 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9

     అందులో ప్రతిదానికి రెండు కొనలుంటాయి. ఆ రెండు కొనలు ఇద్దరి మధ్య ప్రేమ అనుకుంటే… 8 తప్ప మిగతా అంకెలలో మొదటి, చివరి కొనలుంటాయి. ఈ బిందువులకి మధ్య ఏదో ఒక మార్గం వాటిని కలుపుతుంది. కానీ 8 అంకెలో ఆది, అంత్య బిందువులను గుర్తించడం కష్టం. ఆ రెండు బిందువులు తనలో తాను కలిసిపోయి ఉంటాయి. ఆ గొప్పతనం 8 అంకెకుంది. అంటే 143 నంబర్‌కుంది. అంటే ‘I Love You’అంత పవర్‌ఫుల్ వ్యాఖ్యమన్నమాట.

     రెండు మనసులు ఒకటవ్వాలంటే దానికి శుభసూచికం ప్రేమికులదినోత్సవం.

 Happy Valentines Day – HVD – హృదయం వికసించే దారి

ప్రతి మనిషి ప్రేమలో పడటం దాని నుండి బయటకు రావడం సహజం. ఏ విషయంలోనైనా అతి అనేది ఎప్పటికీ ప్రమాదమే. జీవితంలో ప్రేమ ఒక భాగమే. కానీ కొందరు ప్రేమే జీవితంగా భావిస్తారు. అది తప్పు కాదు. కానీ మనకోసం మన కుటుంబసభ్యులు గురించి ఆలోచించాలి.

మనిషికో స్నేహం… మనసుకో దాహం… లేనిదే జీవం లేదు… జీవితం కానే కాదు… మమత అనే మధువు లేనిదే ఛేదు… అని మనసుకవి ఆత్రేయ ఆనాడే చెప్పారు. మీకొక విషయం తెలుసా..? ఆత్రేయగారు ప్రేమలో విఫలమైనవారే. ప్రేమలో విఫలమైన వారు జీవితం అంటే ఏంటి? అని వాళ్లకంతా తెలిసినంది ఎవరికి తెలీదు. విఫలమైన ప్రేమ ఎప్పటికీ మాసిపోదు. మారిపోదు. కాలం ఉన్నంత వరకు చెరిగిపోదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -