‘పుష్ప’లో సమంత ఐటం సాంగ్ రిలీజ్‌ ఎప్పుడంటే..

సమంత విడాకుల అనంతరం స్పీడ్ పెంచింది. సమంత ప్రస్తుతం తన కెరీర్ ను బిజీ షెడ్యూల్ తో నింపేయాలని చూస్తుందట. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలే కాకుండ ఐటం సాంగ్ లకు కూడా ఓకే చెబుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న పుష్ప సినిమా లో సమంత ఓ ఐటం సాంగ్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవల ఈ సాంగ్‌ షూటింగ్‌ ప్రారంభమై షూటింగ్‌ పూర్తయింది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్‌డేట్‌ ఇచ్చింది. డిసెంబర్‌ 10న సమంత ఐటం సాంగ్ విడుదల చేయబోతున్నట్లు పుష్ప టీం ప్రకటించింది. లంగా జాకెట్‌ ధరించి, మాస్‌ లుక్‌తో కనిపిస్తున్న సమంత ఫుల్‌లుక్‌ను విడుదల చేసింది.

రిలీజైన పుష్ప ట్రైలర్ 20 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. పుష్ప సినిమా నుంచి వచ్చిన పాటలు విశేషాదరణ పొందాయి. ఇప్పుడు అందరి దృష్టి సమంత ఐటం సాంగ్ పడింది. పుష్ప సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

టాలీవుడ్ హీరోయిన్స్ ఎక్కడ.. ఏం చదువుకున్నారో తెలుసా ?

టాలీవుడ్ లో ఎంత మంది డాక్టర్లు ఉన్నారో చూడండి..!

ప్రభాస్ వదులుకున్న సూపర్ హిట్ సినిమాలు ఇవే..!

Related Articles

Most Populer

Recent Posts