ప్రభాస్ వదులుకున్న సూపర్ హిట్ సినిమాలు ఇవే..!

- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్ళు పూర్తి అయింది. ఇప్పటివరకు ప్రభాస్ చేసిన సినిమాలు 19 మాత్రమే. ప్రస్తుతం ప్రభాస్ 20 వ చిత్రాన్ని జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ డైరెక్షన్లో చేస్తున్నాడు. అయితే ప్రభాస్ తన కెరీర్ లో రిజెక్ట్ చేసిన సినిమాలు 10 వరకు ఉన్నాయి. వాటిలో కొన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలని, మరికొన్ని డిజాస్టర్ మూవీస్ ఉనాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఒక్కడు : ఈ సినిమా కథను గుణశేఖర్ ముందుగా ప్రభాస్, కృష్ణంరాజు లను వినిపించారట. అయితే కథ విషయంలో కాస్త ఆలోచించి రిజక్ట్ చేశారట.

- Advertisement -

సింహాద్రి : రాజమౌళి సింహాద్రి కథను ముందు ప్రభాస్ కే చెప్పాడట. కానీ అనుకోని కారణాలవల్ల ప్రభాస్ ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశాడు.

ఆర్య : ఆర్య సినిమా కోసం మొదట ప్రభాస్ ని దిల్ రాజు సంప్రదించారట. కాకపోతే అప్పటికే ప్రభాస్ మరో సినిమాలో బిజీగా ఉండటంతో ఆర్య సినిమాని రిజెక్ట్ చేశాడు.

దిల్ : దిల్ సినిమాకు ముందు ప్రభాస్ నే అనుకున్నారట. కానీ ప్రభాస్ మరో సినిమాతో బిజీగా ఉండటం వల్ల దిల్ ను వదిలేశాడు.

నాయక్ : ప్రభాస్ కోసం నాయక్ సినిమా కథ ను సిద్దం చేశాడట వినాయక్. కానీ రెబల్, మిర్చి సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాని ప్రభాస్ వదిలేశాడు.

కిక్ : ఈ సినిమా కథని మొదట ప్రభాస్ వద్దకే వెళ్ళిందట. అప్పటికి రవితేజ పిచ్చ ఫామ్లో ఉండడంతో సూరి రవితేజ ను ఫైనల్ చేసుకున్నాడట.

బృందావనం : బృందావనం కథని ప్రభాస్ వినిపిస్తే అప్పటికే డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలకి కమిట్ అవ్వడంతో.. ప్రభాస్ ఈ సినిమాని వదిలేసాడట.

డాన్ శీను : ఈ కథను ప్రభాస్ కి చెప్పాడట గోపిచంద్ మలినేని. బుజ్జిగాడు సినిమాతో ఈ సినిమాలోని కార్యెక్టర్ ని పోల్చుకున్న ప్రభాస్.. వద్దని చెప్పాడట.

ఊసరవెల్లి : ఈ కథ కూడా ప్రభాస్ రిజెక్ట్ చేసిందేనట.

జిల్ : జిల్ కథను ముందు ప్రభాస్ కి వినిపించాడట డైరెక్టర్. కానీ ప్రభాస్ బాహుబలితో బిజీగా ఉండటం వల్ల కుదరలేదట. దాంతో ఈ సినిమాని గోపిచంద్ తో తీశాడు.

Also Read: మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -