- Advertisement -

చీరకట్టులో సమంత యాక్షన్ ధమాకా..

- Advertisement -

స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సరికొత్త యాక్షన్ డ్రామా ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaaram). తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. “నా ప్రాణం పణంగా పెట్టినా సరే.. నా కుటుంబానికి ఏమీ కాకుండా చూసుకుంటాను.. సరికొత్త ట్విస్ట్‌తో కూడిన మాస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది.” అని సమంత తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ ట్రైలర్ లింక్‌ను పంచుకుంటూ పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని జూన్ 19, 2026 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ట్రైలర్ ప్రారంభంలో సమంత తన ప్రియుడి ఇంటికి రావడం.. అక్కడ ఆమెకు వరుస ప్రశ్నలు ఎదురవడం చూపించారు. “నిన్ను ఎక్కడో చూసినట్లుంది.. నీ పేరేంటి.. మీది ఏ ఊరు..” అంటూ ప్రియుడి కుటుంబ సభ్యులు అడుగుతుంటే.. సమంత మాత్రం “నేను నిజంగా ఎవరినో మీకు తెలుసా?” అంటూ ఒక ప్రశ్నను ఎదురువేస్తుంది. కులం గురించి.. వంట వచ్చా లేదా అని.. తోబుట్టువులు ఎంతమంది అంటూ ఇంట్లోని వారు అడుగుతున్న ప్రశ్నలు ఆమెను ఒక నేరస్థురాలిలా విచారిస్తున్నట్లు అనిపిస్తాయి. ఆ తర్వాత ఆమెను ఆ ఇంటి చిన్న కోడలైన అనసూయకు పరిచయం చేస్తారు. ఇంట్లోని వారంతా అనసూయను ‘మా ఇంటి బంగారం’ అని పిలుస్తుంటారు.

“ఒక ఆదర్శవంతమైన కోడలిగా గుర్తింపు తెచ్చుకోవడానికి అందం.. నాజూకుతనం.. మంచి ప్రవర్తన.. వంట.. పాట వంటి ఎన్నో అర్హతలు ఉండాలి.” అని ఆవేదన వ్యక్తం చేసే సమంత.. తనకు అవేవీ లేవని ప్రకటిస్తుంది. కానీ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎంతటి రిస్క్ అయినా తీసుకునే ఒకే ఒక్క లక్షణం తనకు ఉందని చెబుతుంది. ఆ వెంటనే సమంత విలన్లను లెఫ్ట్ రైట్ సెంటర్ బాదుకుంటూ వెళ్లే యాక్షన్ సీక్వెన్స్ రంగంలోకి వస్తాయి. ఒక సందర్భంలో “హీరో అయినా.. హౌస్ వైఫ్ అయినా.. డైలాగ్ కరెక్ట్‌గా పడితే అవతలివాడు వణకాల్సిందే.” అంటూ పవర్ ఫుల్ కౌంటర్ ఇస్తుంది.

ఈ ఫ్యామిలీ యాక్షన్ కామెడీ డ్రామాను ప్రముఖ మేకర్ రాజ్ నిడిమోరు క్రియేట్ చేయగా.. సమంత సొంత బ్యానర్ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ నిర్మించింది. చిత్రంలో దిగంత్.. గుల్షన్ దేవయ్య కీలక పాత్రలు పోషించగా.. శ్రీముఖి, గౌతమి తారాగణంగా ఉన్నారు. ఈ సినిమా ప్రపంచం చాలా సహజంగా.. ఎమోషనల్‌గా సాగుతూనే ఫ్యామిలీ ఫస్ట్ అనే కాన్సెప్ట్‌తో ఎడ్జీ ఎనర్జీని కలిగి ఉంటుందని సమంత గతంలోనే పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -