సమంత ‘శాకుంతలం’ విడుదల ఎప్పుడంటే?

Samantha Shaakuntalam Movie New Release Date
Samantha Shaakuntalam Movie New Release Date

హీరోయిన్ సమంత లేటెస్ట్ మైథలాజికల్ పాన్ ఇండియా సినిమా శాకుంతలం. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌, గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్స్‌పై దిల్‌రాజు, నీలిమ గుణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సమంత శాకుంతలగా కనిపిస్తే..మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ చైల్డ్ ఆర్టిస్ట్ గా భరతుడి పాత్రలో కనిపించబోతోంది.

సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘శాకుంతలం’ మొదట గత ఏడాది నవంబర్ 4న సినిమాను విడుదలకు ప్లాన్ చేసినా వాయిదా పడి ఫిబ్రవరి 17న విడుదల కావాలి. అయితే… మళ్ళి వాయిదా వేశారు. తాజాగా ఈ రోజు న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 14న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్ల‌డించింది.

Also Read: ఎట్టకేలకు స్పందించిన కృతి సనన్