Saturday, April 27, 2024
- Advertisement -

తెలంగాణ అప్పుల చిట్టా ?

- Advertisement -

ప్రస్తుతం దేశంలోని అన్నీ రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అభివృద్ది పథంలో దూసుకుపోతుందని, అసలైన అభివృద్ది తెలంగాణలోనే జరుగుతోంది అనెంతలా కే‌సి‌ఆర్ సర్కార్ తరచూ చెబుతూనే ఉంది. అయితే అభివృద్ది సంగతి అలా ఉంచితే రాష్ట్రంపై ఉన్న అప్పుల భారం మాత్రం గట్టిగానే ఉంది. తాజాగా తెలంగాణ యొక్క అప్పుల చిట్టాను కేంద్రం మరోసారి బయట పెట్టింది. తెలంగాణ అప్పుల విషయంలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. రాష్ట్ర విభజన నాటికి రూ. 77,577 కోట్ల అప్పు ఉండగా.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 2.83 లక్షల కోట్లకు పెరిగింది. ఇక 2022 అక్టోబర్ నాటికి రూ.4,33,817.6 కోట్లకు చేరినట్లు కేంద్రం వెల్లడించింది. .

ఇది ప్రభుత్వం మాత్రమే చేస్తున్న అప్పు మాత్రమే కాదని, ప్రభుత్వ రంగ మరియు ప్రభుత్వేతర సంస్థలతో పాటు ప్రభుత్వ బ్యాంకులు, కార్పొరేట్ సంస్థలు ఆధానంగా వేల కోట్లు అప్పులు చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఇక నాబోర్డ్ నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం, కార్పొరేషన్ సంస్థలు రుణాలు తీసుకుంటున్నట్లు కేంద్రం చెప్పుకొచ్చింది. నా బోర్డ్ నుంచి రూరల్ దేవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు 7 వేల కోట్ల రుణాలు తీసుకుందట. వేర్ హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద 85.227 వేల కోట్లు అప్పులో తెలంగాణ ప్రభుత్వంతో పాటు కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా భాగంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. అయితే తెలంగాణ విషయం అప్పుల చిట్టాను వివరించిన కేంద్రం.. ఏపీ విషయంలో మాత్రం ఇంత వివరంగా చెప్పెన సందర్భాలు చాలా తక్కువ. నిజానికి అప్పుల విషయంలో ఏపీ ప్రధమ స్థానంలో ఉందనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఏపీ అప్పులను మాత్రం కేంద్ర ప్రభుత్వం అరకొర మాత్రమే చూపిస్తుందనే వాదన పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తుంది.

Also Read: తెలంగాణ మోడల్.. దేశంలో సాధ్యమా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -