Sunday, May 19, 2024
- Advertisement -

స‌మంత ఇలా ‘ఫింగ‌ర్’ చూపించ‌డం క‌రెక్టేనా..?

- Advertisement -

హీరోయిన్ స‌మంతపై గ‌త రెండు రోజులుగా వ‌స్తున్న ట్రోల్స్ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.త‌న భ‌ర్త హీరో నాగ చైత‌న్య‌తో క‌లిసి విదేశాల్లో హాలిడే ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది స‌మంత‌. అయితే ఈ ఫోటోల‌లో స‌మంత ఆఫ్ బికినితో క‌నిపించ‌డంతో నెటిజ‌న్లు ఆమెపై మండిప‌డుతున్నారు.ఓ గొప్ప ఇంటికి కొడ‌లుగా వెళ్లిన నువ్వు చేయాల్సిన ప‌నేనా అంటూ ,సోష‌ల్ మీడియా వేధిక‌గా స‌మంత‌ను ట్రోల్స్ చేస్తున్నారు.పెళ్లైన తరువాత ఇలాంటి బట్టలు వేసుకోవడంపై నాగ‌ర్జున కూడా అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లు వార్త‌లు వినిపించాయి.

తాజాగా ఈ ట్రోల్స్‌పై స‌మంత త‌న ట్వీట్ట‌ర్ ద్వారా స్పందించింది.పెళ్లైనా త‌రువాత కూడా నేను ఎలా జీవించాలో చేబుతామ‌నుకుంటున్న మీకు అంటు మిడిల్ ఫింగ‌ర్ చూపిస్తు త‌న ట్వీట్ట‌ర్‌లో పోస్ట్ చేసి , విమ‌ర్శ‌కుల‌కు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చింది స‌మంత‌.హీరోయిన్ పైగా అక్కినేని ఇంటి కోడ‌లు అయిన స‌మంత నుంచి ఇది ఎవ‌రు ఊహించ‌లేదు.సమంత చేసిన యాక్ట్ కరెక్ట్ అంటూ ఆమె అభిమానులు సపోర్ట్ చేసినప్పటికీ ఎక్కువ మంది మాత్రం ఆమె ఇలా చేయడం తప్పని అంటున్నారు. నిజానికి సమంత సోషల్ మీడియాలో అభిమానులతో సరదాగా మాట్లాడుతుంది.కొందరు ఆమె వ్యక్తిగత జీవితంలో ఎలా ఉండాలో చెప్పడం నచ్చని సమంత ఇలా చేసింద‌ని భావిస్తున్నారు.

దీని వ‌ల్ల స‌మంత మ‌రింత విమ‌ర్శ‌ల‌కు గురైంది. కనీసం మర్యాద లేకుండా ప్రవర్తించి నీ కుటుంబ పరువు కూడా తీస్తున్నావంటూ ఆమెని విమర్శిస్తూ కామెంట్లు చేస్తున్నారు.అక్కినేని ఇంటి కోడ‌లు నుంచి ఇలాంటి ప‌రిణామం ఎవ‌రు ఊహించ‌రు,స‌హించ‌రు కూడా.నీ వ్య‌క్తిగ‌త జీవితాన్ని బ‌య‌ట సోష‌ల్ మీడియాలో ఎందుకు పోస్ట్ చేయ‌డం అని స‌మంత‌ను ప్ర‌శ్నిస్తున్నారు.అలాగే వ్య‌క్తిగ‌త జీవితంలో జ‌రిగే ప్ర‌తిది మాకు చూపిస్తావా అంటూ రెచ్చిపోతున్నారు నెటిజ‌న్లు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -