Friday, May 3, 2024
- Advertisement -

నాకు పిల్ల‌లు కావ‌ల‌నే ఉంది… కాని చైతు ఖాళీగా లేడ‌ట‌ …!

- Advertisement -

హీరోయిన్ స‌మంత హీరో అక్కినేని నాగ‌చైత‌న్య‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే.అక్కినేని ఇంటి కోడ‌లు అయిన త‌రువాత ఆమె న‌టించిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సూప‌ర్ హిట్లుగా నిలిచాయి.తాజాగా ఆమె న‌టించిన యూటర్న్ మూవీ ఈ నెల 13న విడుద‌ల‌కు రెడీగా ఉంది.ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతు త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను కూడా ప్రేక్ష‌కుల‌తో పంచుకుంది స‌మంత‌.

మాములుగానే పెళ్లి అవ్వ‌గానే పిల్ల‌లు ఎప్పుడని అడుగుతుంటారు.ఇక సెల‌బ్రిటీల విష‌యంలో కూడా అయితే ఈ ప్ర‌శ్న మ‌రింత ఎక్కువుగా వినిపిస్తుంది.తాజాగా ఈ విష‌యంపై స్పందించిందిస‌మంత .గ‌తంలోనే నేను ప్రెగ్నెంట్ అని వార్త‌లు సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్షం అయ్యాయ‌ని ,దానిపై నేనే స్వ‌యంగా వివ‌ర‌ణ ఇవ్వాల్సి వ‌చ్చిందని చెప్పింది స‌మంత.తాజాగా ఆమెకు మ‌ళ్లీ అలాంటి ప్ర‌శ్న ఎదురైంది.దీనిక బ‌దులిస్తు….. ”పిల్లలంటే నాకు చాలా ఇష్టం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చైతు మాత్రం రెడీగా లేడు. నాకైతే పిల్లలు కావాలనే ఉంది కానీ ఈ ఈ విషయంలో చైతుని ఎక్కువగా ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదు.

పిల్లలు ఎప్పుడనేది ఇంకా ప్లాన్ చేయలేదు. చైతు ఎప్పుడు అంటే అప్పుడే” అంటూ చెప్పుకొచ్చింది. ఈ విషయంలో ఇంకా ఏమైనా సందేహాలుంటే చైతుని అడగమని సలహా ఇస్తోంది.ఇక నాగ‌చైత‌న్య హీరోగా న‌టించిన శైలజారెడ్డి అల్లుడు సినిమా కూడా ఈ నెల 13నే విడుద‌ల కానుంది.త‌న సినిమాతో పాటు చైతు సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకుంటాను అని చెప్పుకొచ్చింది స‌మంత‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -