Friday, May 10, 2024
- Advertisement -

ఓడించిన చోటే జ‌గ‌న్‌కు నీరాజ‌నాలు..

- Advertisement -

విశాఖ జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం కంచరపాలెంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ నిర్వ‌హించారు. ఈ స‌భ‌కు విశాఖతోపాటు పరిసర ప్రాంతాల నుంచి జనం సునామీలా పోటెత్తడంతో కిలోమీటర్ల మేర ఇసుకేస్తే రాలనంతగా సభ జనంతో కిటకిటలాడింది. బ‌హిరంగ స‌భ సునామీని త‌ల‌పించింది.

కంచెర పాలెంలో జ‌గ‌న్ స‌భ‌కు వ‌చ్చిన జన సునామీని చూసి సీఎం చంద్ర‌బాబుతో పాటు టీడీపీ వ‌ర్గాల్లో క‌ల‌వ‌రం మొద‌ల‌య్యింది. తాజాగా కంచరపాలెం సభకూ జనం తండోపతండాలుగా రావడం అధికార పార్టీ నేతల్లో చర్చకు దారితీసింది. సభ వివరాలపై పోలీసు, ఇంటెలిజెన్స్‌ అధికారులతోపాటు విశాఖ పోలీసు కమిషనర్‌ మహేష్‌చంద్రలడ్డాను పిలిచి సీఎం చంద్రబాబు ఆరా తీసినట్లు సమాచారం.

జగన్‌ ప్రసంగానికి ప్రజలు కరతాళధ్వనులతో మద్దతు పలకడం టీడీపీ పట్ల పెల్లుబుకుతున్న వ్యతిరేకతకు నిలువుటద్దంలా మారింది. దీంతో ప్రజల్లో ప్రభుత్వం, పార్టీ పట్ల 80%కు పైగా సంతృప్తి ఉందంటూ వివిధ ఏజెన్సీల ద్వారా తెప్పించుకుంటున్న నివేదికల్లో వాస్తవాలపై బాబు పునరాలోచనలో పడ్డట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

రాబోయే ఎన్నికలలో ఎలాగైనా విశాఖపట్టణం జిల్లాలో ప్రభంజనం సృష్టించాలని జగన్ వైజాగ్ జిల్లాపై ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. విశాఖపట్టణం జిల్లా కంచరపాలంలో జరిగిన మహాసభ గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సభను చూసి తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల నోట్లో నుండి మాటలు రావడం లేదు.దాదాపు రెండు లక్షల మంది ఈ సభకు విశాఖ జనసందోహం హాజరైనట్లు సమాచారం.

మొత్తంమీద విశాఖలో జగన్ ప్రభంజనం సృష్టించారు. ఎన్నికల రాకముందే జగన్ ముఖ్యమంత్రి అయ్యారా అన్నట్టుగా విశాఖ ప్రజలు జగన్ ప్రసంగానికి స్పందించారు. 2014 ఎన్నిక‌ల్లో పార్టీనీ ఓడించిన చోటే జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లు నీరాజ‌నం ప‌ట్ట‌డం చూస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ ప్ర‌భంజ‌నం సృష్టించ‌డం ఖాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -