- Advertisement -

సినిమాలు మానేద్దాం అనుకున్నా!

- Advertisement -

అక్కినేని ఇంటి కోడ‌లు స‌మంత ప్ర‌స్తుతం స‌మ్మ‌ర్ వెకేష‌న్‌లో ఉంది.ఇటీవ‌లే రంగ‌స్థ‌లం సినిమా హిట్‌తో మంచి జోష్‌లో ఉంది. మ‌హ‌న‌టి సినిమాలో స‌మంత కీల‌క పాత్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందే.తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన సమంత, వ్యక్తిగత జీవితంతో పాటు సినిమా లైఫ్‌ను కూడా వివ‌రించింది.త‌ను న‌ట‌న‌ను ఓ ఉద్యోగంలా ఫీల‌వుతాను అని ఒకప్పుడు హిట్ సినిమాల్లో నటించినా త‌న‌కు పెద్ద‌గా చెప్పుకొద‌గ్గ పాత్ర‌లు రాలేద‌ని త‌రువాత కాలంలో త‌న న‌ట‌న‌ను చూసి నా గురించి కూడా క‌థ‌లు రాయ‌డం మొద‌లు పెట్టారని చెప్పుకొచ్చింది.

ఒక దశలో సినిమాలు మానేద్దామని అనుకున్నానని, అయితే, మంచి కథలు వస్తుండటంతో అలా చేయాల్సిన అవసరం కలగలేదని చెప్పింది. ఖాళీ స‌మ‌యంలో చైతుతో బ‌య‌ట‌కి వెళ్ల‌టానికి ప్ర‌య‌త్నిస్తానని , మేం క‌లిస్తే అస‌లు సినిమాలు గురించి మాట్లాడుకొమ‌ని అని చెప్ప‌కొచ్చింది స‌మంత‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -