Saturday, May 4, 2024
- Advertisement -

లేడీ సూపర్ స్టార్ సినిమా సీక్వెల్ లో సమంత

- Advertisement -

ప్రస్తుతం సౌత్ లో లేడి ఓరియెంటెడ్ చిత్రాలు అంటే దర్శకులకు ముందుగా గుర్తొచ్చే పేరు నయనతార. అయితే తాజాగా ఈ బాటలోనే చేరిపోయింది స్టార్ హీరోయిన్ సమంత. మొన్నటిదాకా గ్లామరస్ పాత్రలు లో నటించిన సమంత ఇప్పుడు కంటెంట్ ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ వరుస విజయాలతో ముందుకు దూసుకుపోతోంది. ఈ మధ్యనే సమంత హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఓ బేబీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మరోవైపు సమంత నయనతార హీరోయిన్ గా నటించిన ఒక సినిమా కు సీక్వెల్ లో నటించబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.

‘ఆరం’ సినిమాలో కలెక్టర్ పాత్ర పోషించిన నయన్ మంచి విజయాన్ని అందుకుంది. గోపి నైనర్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అయితే తాజాగా ఈ సినిమాకి అనే ‘ఆరం 2’ టైటిల్ తో సీక్వెల్ తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం గోపి నయనతార ని కాకుండా వేరే హీరోయిన్ని తీసుకోవాలని అనుకుంటున్నాడట. ఈ నేపథ్యంలో గోపి సమంత పై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ‘యూటర్న్’ సినిమా తర్వాత మళ్లీ సమంతా ని సీరియస్ పాత్రలో ప్రేక్షకులు చూడగలరా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి సమంత ఈ సినిమాకి ఓకే అంటుందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -