Sunday, May 5, 2024
- Advertisement -

కొత్త‌ర‌కం ప‌బ్లిసిటీ స్టార్ట్ చేసిన స‌మంత‌

- Advertisement -

అక్కినేని ఇంటి కోడ‌లు అయిన త‌రువాత వ‌రుస హిట్లు కొట్టింది హీరోయిన్ స‌మంత‌.ఆ స‌క్సెస్‌ను కంటిన్య్వూ చేయాల‌నే గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉంది స‌మంత.ప్ర‌స్తుతం ఆమె న‌టించిన యు టర్న్ సినిమా విడుద‌లకు రెడీ అవుతుంది. ఈ నెల 13న యు టర్న్ సినిమా విడుద‌ల చేస్తున్నారు. థ్రిల్లర్ జానర్ లో రూపొందిన ఈ మూవీ చూడడానికి వంద కారణాలు చెప్పమంటే అందులో తొంభై సమంతా పేరే చెబుతాయి. కాకపోతే ఇది రెగ్యులర్ కమర్షియల్ ఫిలిం కాదు కాబట్టి మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం అంత తేలిక కాదు.

అందుకే మేకర్స్ కొత్త తరహా ప్రమోషన్ కు తెరతీశారు. ప్రమోషనల్ సాంగ్ పేరుతో యు టర్న్ టీమ్ విడుదల చేసిన ఓ వీడియో సాంగ్ ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. సమంతా స్టెప్స్ వేస్తూ ఉండగా సదా నువ్వే కదా ప్రతి క్షణాన అంటూ సాగిపోయే ఈ పాట సామ్ మూమెంట్స్ కూడా బాగానే ఉన్నాయి. అయితే ఈ సాంగ్ సినిమాలో ఉండ‌ద‌ని తెలుస్తుంది. ఆది పినిశెట్టి ఈ సినిమాలో ఓ కీలక పాత్ర‌లో న‌టిస్తున్నాడు.ఈ సినిమా కూడా త‌న‌కు మ‌రో హిట్ ఇస్తుందని భావిస్తుంది స‌మంత‌.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -