Saturday, May 18, 2024
- Advertisement -

బ‌ర్రెల‌ను తోలుతూ.. క‌ట్టెలు విరుస్తూ

- Advertisement -
  • రంగ‌స్థ‌లంలో ఊర‌మ్మాయిగా స‌మంత‌

పాత‌కాలం నేప‌థ్యంలో సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రంగ‌స్థ‌లం సినిమా వ‌స్తోంది. ఈ సినిమా మొత్తం 1985 కాలం నాటి దృశ్యాలు ఉండేలా ప‌క్కగా చిత్ర‌బృందం ప్లానేసింది. ఆ విధంగానే చిత్ర ఫ‌స్ట్‌లుక్, టైటిల్ ఉంది. ఆ విధంగానే హీరో రామ్‌చ‌ర‌ణ్‌తేజ లుక్ కూడా ఉంది. మాస్ లుక్‌లో చ‌ర‌ణ్ లుంగీ వేసుకొని.. గ‌ల్లా చొక్కాతో ట‌వ‌ల్ ప‌ట్టుకొని పైకి ప‌ట్టుకొని స్టెప్పులేస్తున్నాడు. ఆ కాలం నాటి లుక్‌లో చ‌ర‌ణ్ క‌నిపించాడు. ఇక ఈ సినిమాలో స‌మంత మాత్రం అన్ గ్లామ‌ర్ పాత్ర‌గా క‌నిపిస్తోంది.

పూర్తిగా ప‌ల్లెటూరి అమ్మాయిగా క‌నిపిస్తోంది. అస్స‌లు స‌మంత‌ను ఆ విధంగా ఊహించ‌న‌లేం. ఇటీవ‌ల విడుద‌లైన ఓ పోస్ట‌ర్‌లో చ‌ర‌ణ్ బావిలో నీళ్లు తోడుతుండ‌గా స‌మంత క‌నిపించింది. లంగావోణిలో ల‌వ్లీగా ఉంది. ఇప్పుడు మ‌రో రెండు ఫొటోల్లో న‌దీ ప‌రివాహాక ప్రాంతంలో గుడిసెలో పొయ్యి ముందు క‌ట్టెలు విర‌స్తూ.. వంట వండుతూ… బ‌ర్రెల‌ను తోలుకొస్తూ క‌నిపించింది. హాట్‌హాట్‌గా క‌నిపించే స‌మంత ఒక్క‌సారిగా ప‌ల్లెటూరి అమ్మాయిగా క‌నిపించ‌డం అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటోంది. ఈ సినిమాకు దేవీశ్రీప్ర‌సాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -