Tuesday, April 30, 2024
- Advertisement -

విజయ్ సాయి ఆత్మహత్య కేసు విచార‌ణ‌లో విస్తుపోఏ నిజాలు….

- Advertisement -

ఆత్మహత్య చేసుకున్న నటుడు విజయ్ సాయి కేసులో పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మ‌రో ట్విష్ట్ చోటు చేస‌కుంది. విజయ్ సాయి భార్య వనితకు రెండు పేర్లు ఉన్నాయని ఇప్పటికే గుర్తించిన విషయం తెలిసిందే.

విజయ్ సాయి భార్య పేరు వనిత కాదని, ఆమె అసలు పేరు వరలక్ష్మి అని పోలీసులు గుర్తించారు. స్కూల్ సర్టిఫికెట్, పాస్ పోర్టులలో వేర్వేరు పేర్లు ఉన్నాయని, తండ్రి పేరు కూడా వేర్వేరుగా ఉందని తెలుసుకున్నారు. ఇక ఆమె తల్లి రఫీ అనే వ్యక్తితో సహజీవనం సాగిస్తోందని కూడా గుర్తించిన పోలీసులు, విజయ్ కి, రఫీకి మధ్య ఏదైనా గొడవలు ఉన్నాయా? అన్న కోణంలోనూ దర్యాఫ్తు సాగిస్తున్నారు.

విజ‌య్ సూసైడ్ వీడియోలో విజయ్ ఆరోపించిన లాయర్ శ్రీనివాస్ కు నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని పోలీసులు నిర్ణయించారు. ఇన్ని పేర్లు, ముఖ్యంగా తండ్రి పేరు మారిన కారణాలను గురించి ప్రస్తుతం వనితను ప్రశ్నిస్తున్న పోలీసులు, ఆమె నుంచి మరిన్ని వివరాలు వస్తే, వారి కుటుంబ నేపథ్యం గురించి ఓ అవగాహన వస్తుందని, అది కేసుకు ముఖ్యమని పోలీసు వర్గాలు అంటున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -