Saturday, May 4, 2024
- Advertisement -

స‌మంత అప్పు ఇచ్చిందెవ‌రికి?

- Advertisement -
  • బాల‌కృష్ణుడు సినిమాతో ఏం సంబంధం 

    అక్కినేని వంశ కోడ‌లు, న‌టి స‌మంత అప్పు ఇచ్చింద‌ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇటీవ‌ల తాను ప్రేమించిన వ్య‌క్తిని పెళ్లాడి వివాహ జీవితాన్ని ఆనందిస్తోంది. ఈ స‌మ‌యంలో అప్పు వార్త షికార్లు కొడుతోంది. ఇంత‌కు ఆమె అప్ప‌లు ఇస్తే ఎవ‌రికి ఇచ్చింది? ఎందుకు ఇచ్చింది? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. స‌మంత మేనేజ‌ర్‌గా ఏళ్ల నుంచి ఓ వ్య‌క్తి ప‌నిచేస్తున్నాడు. అత‌డు సినిమా వ్యాపారంలోకి కూడా దిగాడు. నారా రోహిత్ హీరోగా బాల‌కృష్ణుడు సినిమా వ‌స్తోంది. ఆ సినిమాకు ఆ మేనేజ‌ర్ పెట్టుబ‌డి పెట్టాడు. ఆయ‌న ఇంత‌కుముందు కూడా చిన్న బ‌డ్జెట్ సినిమాల‌ను తెర‌కెక్కించాడు. ఆ విధంగా బాల‌కృష్ణుడు సినిమాకు పెట్టుబ‌డి పెట్టాల‌నుకున్నాడు.

    స‌గం పెట్టి సినిమా పూర్తి చేశారు. అయితే ఆ సినిమా విడుద‌ల చేసే స‌మ‌యం కొద్ది రోజులే ఉండడంతో డ‌బ్బుల క‌ష్టాలు వ‌చ్చి ప‌డ్డాయి. ఆయన సినిమా షూటింగ్ ఎండింగ్‌లో డబ్బు కొర‌తతో అత‌డు స‌త‌మ‌త‌మ‌య్యాడు. దీంతో సమంత స్పందించి రూ.3 కోట్ల వరకు స‌హాయం చేసిందట. ప్రస్తుతం ఈ ముచ్చ‌ట హాట్ టాపిక్ అయ్యింది. అందుకే బాల‌కృష్ణుడు ప్రీ రిలీజ్ వేడుక‌కు ఆమె హాజ‌రైంది. ఈ విధంగా స‌మంత సేవా గుణాన్ని చూసి అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే ఆమె ఒక స్వ‌చ్ఛంద సంస్థ ఏర్పాటుచేసి చిన్నారుల కోసంఅ స‌హాయ కార్య‌క్ర‌మాలు చేస్తోంది.

అయితే సమంత కొన్ని ఏరియాల్లో రైట్స్ పరంగా డీల్ సెట్ చేసుకుందట. అంటే ఓ విధంగా బిజినెస్ అనుకోవచ్చు. బాలకృష్ణుడు ట్రైలర్ చూసి సమంత కొంచెం నమ్మకం తో ఉందని తెలుస్తోంది. మరి సినిమా ఎంత వరకు సమంత కి హెల్ప్ అవుతుందో చూడాలి. ఇక ఈ సినిమా ఈనెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నారా రోహిత్ స‌ర‌స‌న రెజీనా న‌టిస్తోంది.

https://www.youtube.com/watch?v=8CmhZgCBArU

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -