టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు తమదైన కామెడీ పండించారు. అయితే ‘హృదయకాలేయం’ లాంటి చిత్రంతో వెరైటీ కామెడీ పండించి తెగ పాపులర్ అయ్యాడు సంపూర్ణేష్ బాబు. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి కొద్ది రోజులకే తనకు తానుగా వెళ్లిపోయాడు. సింగం 123, కొబ్బరిమట్ట చిత్రాల తర్వాత బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్‌బాబు నటిస్తోన్న చిత్రం బజార్‌రౌడీ. వసంత నాగేశ్వర దర్శకత్వం వహిస్తన్నాడు.
కేఎస్ క్రియేషన్స్ బ్యానర్ పై సందిరెడ్డి శ్రీనివాస్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ పోస్టర్ లో సంపూని నిజంగా మాస్ హీరోలా భలే కనిపిస్తున్నాడు. ఛార్మినార్, హైదరాబాద్ మెట్రో రైలు స్టిల్స్ తో మొదలై, జీపులో రౌడీ.. రసూల్ పురా అంటూ కనిస్తుంది.
ఇక మంచంపై పడుకొని సిగరెట్ వెలిగిస్తూ సంపూ సూపర్ స్టైల్ లో కనిపిస్తున్నాడు. పెద్ద పెద్ద స్టార్ హీరోల దగ్గర పనిచేసిన ప్రేమ్ రక్షిత్మాస్టర్ సంపూకు కొరియోగ్రఫీ చేస్తుండటం విశేషం. మరి ఈ చిత్రం కామెడీ ఆడియన్స్ ని ఏ రేంజ్ లో ఆకర్షిస్తుందో చూడాలి.
టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్.. మాజీ ఎమ్మెల్సీ రాజీనామా
మేలో మెగా మేనల్లుడు సాయి తేజ్ పెళ్లి!