Friday, April 19, 2024
- Advertisement -

క్యాలీఫ్లవర్​ పోస్టర్​ రిలీజ్​.. సంపూ నవ్వించి చంపేస్తాడేమో?

- Advertisement -

సంపూర్ణేశ్​ బాబు తెలుగు ఇండస్ట్రీలోకి వినూత్నంగా అడుగులు పెట్టాడు. తెలుగులోని మాస్​ హీరోలు, వాళ్ల డ్యాన్సులు, డైలాగులను కాస్త వ్యంగ్యంగా పేరడీ చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక సంపూ నటనను ప్రేక్షకులు సైతం అంగీకరించారు. హృదయకాలేయం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సంపూ.. ఆ తర్వాత కొబ్బరి మట్టతో సక్సెస్​ అందుకున్నాడు. ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించాడు.ప్రస్తుతం క్యాలీఫ్లవర్​ అనే సినిమాలో నటిస్తున్నాడు. ‘శీలో రక్షతి రక్షిత :’ అనేది ట్యాగ్​ లైన్​.

ఈ మూవీలో సంపూ లండన్​ లో చదువుకొని స్వదేశానికి తిరిగిచ్చిన వ్యక్తిగా నటించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్​ పూర్తయిందని త్వరలోనే విడుదల చేస్తామని మేకర్స్​ ప్రకటించారు.ఇక తాజాగా సంపూ రాముడు గెటప్​లో ఉన్న ఓ పోస్టర్​ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ గెటప్​లో సంపూ డిఫరెంట్​గా కనిపిస్తున్నాడు. సంపూ రాముడి గెటప్​లో ధనస్సును పట్టుకొన్నాడు. కానీ అతడు బాణాలను విసరడం లేదు.. బాణాల స్థానంలో కొలబద్దలు విసురుతున్నాడు. ఇక అమ్ముల పొదిలో సైతం కొలబద్దలే ఉన్నాయి. దీంతో ఈ చిత్రంలో కామెడీ కాస్త విభిన్నంగా ఉండబోతున్నదని అర్థమవుతున్నది.

ఈ పోస్టర్​ చూసిన నెటిజన్లు.. సంపూ మరోసారి కామెడీతో చంపేసేటట్టున్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. క్యాలీఫ్లవర్​ మూవీకి ఆర్కే మలినేని దర్శకత్వం వహించాడు. గుడూరు శ్రీధర్‌ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణ టాకీస్‌ పతాకాలపై ఆశ జ్యోతి గోగినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపీకిరణ్‌ ఈ సినిమాకు కథ అందించారు. సంపూ సరసన వాసంతి హీరోయిన్‌గా నటించింది.

Also Read

జెర్సీ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ..!

ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా లైన్లోనే.. ఆగిపోలేదట..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -