Thursday, April 25, 2024
- Advertisement -

సందీప్ గల్లీ రౌడీ రిలీజ్ డేట్ ఫిక్స్..!

- Advertisement -

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఎన్నో సినిమాల షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ ద్వితీయార్థం నుంచి షూటింగ్, సినిమాల విడుదల ఆగిపోయింది. ఏప్రిల్ కు ముందుగా షూటింగ్ పూర్తి చేసుకున్న చాలా సినిమాలు విడుదలకు నోచుకోలేదు. కొన్ని సినిమాలు ఓటీటీ లో విడుదలైనప్పటికీ..మరికొన్ని సినిమాలను థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్మాతలు ఎదురుచూస్తూ వచ్చారు.

ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకున్నాయి. దీంతో విడుదల ఆగిపోయిన సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్నాయి. కొంత మేర షూటింగ్ మిగిలిపోయిన సినిమాలను కూడా పూర్తిచేసి వరుసగా విడుదల డేట్లను అనౌన్స్ చేస్తున్నారు. దసరా, వినాయక చవితి,సంక్రాంతి పండుగల సందర్భంగా అగ్ర హీరోలు నటించిన సినిమాలు విడుదల కానున్నాయి ఇందుకు సంబంధించి విడుదల తేదీలను కూడా ఖరారు చేశారు.

తాజాగా సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్టైనర్ గల్లీ రౌడీ మూవీ రిలీజ్ డేట్ ఖరారు అయ్యింది. ఈ సినిమాను సెప్టెంబర్ 3వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.తాజాగా దీనికి సంబంధించి పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాలో సందీప్ కిషన్ కి జోడిగా నేహా శెట్టి నటిస్తుండగా, కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై ఎం.వి.వి సత్యనారాయణ, కోనవెంకట్ ఈ మూవీని నిర్మించారు.

Also Read: నాగ్ మన్మథుడు హీరోయిన్ ఇప్పుడు ఎలాఉందో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -