భీమ్లా నాయక్ నుంచి మరొక సర్ప్రైజ్.. సిద్ధమవుతున్న రానా టీజర్..!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ మూవీ భీమ్లా నాయక్. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ మూవీకి ఇది రీమేక్. ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది.

కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ఇటీవల విడుదలైంది. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. పవన్ తనకు అడ్డొచ్చిన రౌడీలను చితకబాదుతూ రానా కోసం వెళ్తుండటం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ గ్లింప్స్ ప్రస్తుతం యూట్యూబ్ లో రికార్డులను సృష్టిస్తోంది. అయితే మల్టీస్టారర్ సినిమా అని చెప్పి ఓన్లీ పవన్ కళ్యాణ్ వీడియో మాత్రమే విడుదల చేయడంతో దగ్గుబాటి రానా అభిమానులు నొచ్చుకున్నారు. వీడియోలో ఎక్కడ కూడా రానా కనిపించకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కోసం ఈ కథ మొత్తం మార్చారనే వార్తలు వచ్చాయి.

- Advertisement -

అయితే ఈ సినిమా మేకర్స్ వ్యూహాత్మకంగానే వీడియోలో రానాను చూపించలేదని తెలుస్తోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ లాగే ఒక్కో హీరోని ఒక్కో వీడియోలో పరిచయం చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ముందుగా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ గ్లింప్స్ విడుదల చేశారు. కొద్దిరోజుల తర్వాత రానా క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ మరో గ్లింప్స్ విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించి పనులు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే రానాకు సంబంధించిన వీడియో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.

Also Read: ఎవరూ ఊహించని కాంబినేషన్.. పాన్ ఇండియా హీరోల మల్టీ స్టారర్..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -