Friday, April 19, 2024
- Advertisement -

కొత్త గెట‌ప్ తో ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ సందీప్ కిషన్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌!

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’  మంచి విజయం అందుకున్న సందీప్ కిషన్ తర్వాత పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాడు. ఆ మద్య రిలీజ్ అయిన తెనాలి రామకృష్ణ చిత్రంతో కాస్త పరవాలేదు అనిపించుకున్నాడు.

తాజాగా  డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌ర్‌, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్‌, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం నిర్మిస్తున్నారు. 

ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది. తాాజాగా “ఏ 1 ఎక్స్‌ప్రెస్` ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌ను ఈ రోజు విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌. ఈ పోస్ట‌ర్‌లో సందీప్ కిష‌న్  ఎయిట్ ప్యాక్ బాడీతో ఒక చేతిలో హాకీ స్టిక్ ప‌ట్టుకుని మ‌రో చేతితో త‌న చొక్కాని స్టేడియంలో ఊపుతున్న‌ట్లు చూపించారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా థియేట‌ర్స్‌లో విడుద‌ల కానుంద‌ని చిత్ర యూనిట్ తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -