Thursday, May 2, 2024
- Advertisement -

స్థానిక ఎన్నికలకు సహకరించం : ఏపీ ఉద్యోగ సంఘాలు

- Advertisement -

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఓ వైపు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల విధులు ఎలా నిర్వహిస్తామని అంటున్నారు ఏపి ఉద్యోగ సంఘాలు. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ జారీచేసిన కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ తీరుపై ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. ఎన్నికల నోటిఫికేషన్ ను ఈసీ వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ఎన్టీవో అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో కరోనా కొత్త స్ట్రెయిన్, బర్డ్ ఫ్లూ వంటివి ప్రబలుతున్నాయని.. వీటిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికలను నిలుపుదల చేయాలని అన్నారు. లేనిపక్షంలో తాము ఎన్నికల విధులను బహిష్కరిస్తామని చెప్పారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ కోసం డ్రైరన్‌ జరుగుతోందని, ఇలాంటి సమయంలో నోటిఫికేషన్‌ విడుదల చేయడమేంటని ప్రశ్నించారు. నోటిఫికేషన్ అప్రజాస్వామికమని, ఎన్నికల కమిషనర్‌ మొండిగా నోటిఫికేషన్ విడుదల చేశారన్నారు. ఎస్‌ఈసీ తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. 

అంతే కాదు ఎన్నికల తర్వాత తెలంగాణ, బీహార్ రాష్ట్రాల్లో కరోనా వ్యాపించిందని అన్నారు.ద్యోగుల ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించడం సరికాదని, ఎన్నికల కమిషన్‌ వ్యక్తుల కోసం కాదు.. వ్యవస్థ కోసం పని చేయాలన్నారు. పంతాలకు పోయి తమను ఇబ్బంది పెట్టొద్దని, ఎస్‌ఈసీ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -