Thursday, April 18, 2024
- Advertisement -

నానియా తొక్క.. ఎన్టీఆర్ టాప్ అక్క‌డ : సంజ‌న‌

- Advertisement -

ఎన్నో భారీ అంచనాల మ‌ధ్య ప్రారంభ‌మైన బిగ్‌బాస్ రెండ‌వ సీజ‌న్ మొద‌టివారం పూర్తి చేసుకుంది. బిగ్‌బాస్ రెండవ సీజ‌న్‌లో పెద్ద‌గా స్టార్స్‌ను ఎవ‌ర‌ని తీసుకోలేదు. దీంతో అభిమానులు కొంత నిరాశ‌కు గురైయ్యారు. బిగ్‌బాస్‌-2లో సెల‌బ్రిటీల‌తో పాటు కామన్ మ్యాన్ కూడా చోటు క‌ల్పించిన సంగ‌తి తెలిసిందే. అయితే షోలో మొద‌టి ఎలిమినేష‌న్స్‌లో భాగంగా కామ‌న్ మ్యాన్ అయిన సంజ‌న ఎలిమినేట్ అయింది. అయితే బ‌య‌టికి వ‌చ్చిన సంజ‌న బిగ్‌బాస్‌పై సంచ‌ల‌న కామెంట్స్ చేసింది.

షోలో నుండి నన్ను కావ‌ల‌నే పంపిచార‌ని,అంద‌రు క‌లిసి నన్ను టార్గెట్ చేసి బ‌య‌టికి పంపించార‌ని చెప్పుకొచ్చింది. పైగా టెలికాస్ట్‌లో నా గురించి ఎక్కువ చెడుగా చూపించే స‌న్నివేశాలు చూపించార‌ని ఆరోపించింది. అక్క‌డ అంద‌రు పెద్ద సెల‌బ్రిటీలుగా ఫీల్ అవుతున్నారని,వాళ్ల‌కు అంత సీన్ లేద‌ని తెలిపింది. నేను బిగ్‌బాస్‌లో ఉన్నందుకు పైసా కూడా తీసుకోలేద‌ని పెర్కొంది. ప‌నిలో పనిగా నాని యాంక‌రింగ్‌పై కూడా కామెంట్స్ చేసింది. నాని యాంక‌రింగ్ అంతాగా ఏం బాలేద‌ని,ఎన్టీఆర్‌తో పోలిస్తే నాని ఎక్క‌డో కింద ఉన్నాడ‌ని తెలిపింది. సినిమాల‌లో అవ‌కాశాలు వ‌స్తే చేస్తాన‌ని చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -